Devi Sri Prasad Accept Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో టాలీవుడ్ రాక్ స్టార్!

టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)కి

Krishna
Published on: 28 July 2020 10:42 PM IST
Devi Sri Prasad Accept Green India Challenge:  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో టాలీవుడ్ రాక్ స్టార్!
X
Devi Sri Prasad participates in Green India Challenge with his family

Devi Sri Prasad Accept Green India Challenge: టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. సినీ,రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతూ మిగతా వారిని కూడా మొక్కలు నాటలని కోరుతున్నారు. నలుమూలలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యాప్తి చెందింది. మూడు కోట్ల మొక్కలకు ఈ ఛాలెంజ్ చేరువైంది. అందులో భాగంగా తాజాగా టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు.

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతల్లో ఒకరైన రవి ఇచ్చిన నామినేషన్ ని స్వీకరించిన దేవీశ్రీ ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. దీనికి సంబంధించిన ఫోటోలను దేవీ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ఇలాగే కొనసాగించాలని, ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్ ని మనసారా అభినిందిస్తున్నట్టుగా దేవి వెల్లడించాడు. అనంతరం దర్శకుడు హారీశ్ శంకర్, హీరోయిన్ శ్రుతీహాసన్ లను నామినేట్ చేస్తున్నట్టుగా వెల్లడించాడు దేవీ!

ఇక దేవీ సినిమాల విషయానికి వచ్చేసరికి ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టిన దేవీ ప్రస్తుతం ఉప్పెన, రంగ్ దే, పుష్ప చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కరోనా వలన ఈ సినిమాలు వాయిదా పడ్డాయి.



Krishna

Krishna

Next Story