Devi Sri Prasad: ఈ ఇద్దరు స్టార్ హీరోల కోసం దేవి శ్రీ ప్రసాద్ పడుతున్న తంటాలు..

Devi Sri Prasad: ఈ ఇద్దరు స్టార్ హీరోల కోసం దేవి శ్రీ ప్రసాద్ పడుతున్న తంటాలు

Jyothi
Updated on: 20 March 2023 9:30 PM IST
Devi Sri Prasad is Working Day and Night for Star Heroes
X

Devi Sri Prasad: స్టార్ హీరోల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న దేవి శ్రీ ప్రసాద్

Devi Sri Prasad: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవి శ్రీ ప్రసాద్ కూడా ఒకరు. దాదాపు అందరూ స్టార్ హీరోల సినిమాలకి అదిరిపోయే బ్లాక్ బస్టర్ పాటలను అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి కి వాల్తేరు వీరయ్య సినిమాతో మరొక మ్యూజికల్ హిట్ ను అందించారు. ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ తదుపరి ప్రాజెక్టుల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న "పుష్ప: ది రూల్" సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

"పుష్ప" సినిమాకి అదిరిపోయే చార్ట్ బస్టర్ పాటలను అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి కూడా అదే రేంజ్ లో పాటలను అందించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో జరుగుతున్నాయి. సుకుమార్ కూడా ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నారు. మరొకవైపు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా శివ దర్శకత్వంలో కూడా ఒక సినిమా త్వరలో తెరకెక్కనుంది. ఈ సినిమాకి కూడా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. పగలంతా "పుష్ప" పాటల తో బిజీగా ఉంటున్నా దేవి శ్రీ ప్రసాద్ రాత్రంతా సూర్య సినిమా పై దృష్టి పెడుతున్నారు. ఇలా ఈ ఇద్దరు హీరోలకు మంచి సంగీతాన్ని అందించడం కోసం దేవి శ్రీ ప్రసాద్ లో కష్టపడుతున్నారన్నమాట.

Jyothi

Jyothi

Next Story