శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Arun Chilukuri
Published on: 26 Sept 2020 12:04 PM IST
శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
X

సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఇద్దరు నిందితులైన సాయికృష్ణ, దేవరాజ్‌ను మూడురోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వారి నుంచి ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు సీన్ రికనస్ట్రక్షన్ చేయనున్నారు ఎన్ఆర్ నగర్ పోలీసులు.

ప్రేమిస్తున్నట్లు నటించి శ్రావణిని బ్లాక్‌మెయిల్‌ చేసి తీవ్రంగా వేధింపులకు గురి చేసి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారనే ఆరోపణలతో దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డితో పాటు సినీ నిర్మాత అశోక్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. శ్రావణి ఆత్మహత్యకు ముందు శ్రీకన్య హోటల్‌లో సాయి, దేవరాజ్, శ్రావణి మధ్య గొడవ జరిగింది. ఆత్మహత్యకు ముందు ముగ్గురి సెల్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేపట్టనున్నారు. ప్రేమ పేరుతో శ్రావణిని సాయి, దేవ్‌రాజ్ మోసం చేశారు. ఈ కేసులో లభించిన ఆడియోలు, వీడియోల ఆధారంగా పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story