Films Promotion: జోరు పెంచిన ‘దేవర’, ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలు.. ప్రచారంలో ఎన్టీఆర్, రాంచరణ్‌ల దూకుడు..!

Devara and Game Changer movies of Tollywood star heroes like ntr and ram charan increased the speed of promotion
X

Films promotion: జోరు పెంచిన ‘దేవర’, ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలు.. ప్రచారంలో ఎన్టీఆర్, రాంచరణ్‌ల దూకుడు

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ప్రచారంలో స్పీడ్ పెంచేశాయి. ఓవైపు పాటలు, మరోవైపు పబ్లిసిటీ కోసం వాడే ఫొటోలతో ప్రేక్షకులను ఆకట్టుకునే పని చేస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తోన్న ‘దేవర’ ట్రైలర్‌ సెప్టెంబర్ 10న రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అలాగే, రామ్‌చరణ్‌ హీరోగా రానున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ రెండో సాంగ్‌ని ఇదే నెలలోనే రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

అయితే, కొరటాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ - జాన్వీకపూర్‌ జోడీగా రానున్న ‘దేవర’ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అలాగే, శంకర్‌ డైరెక్షన్‌లో రామ్‌చరణ్, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ‘గేమ్‌ ఛేంజర్‌’ క్రిస్మస్‌ సందర్భంగా రిలీజ్ కానుంది. అయితే, గేమ్ ఛేంజర్ సినిమా ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలను ఫినీష్ చేసే పనిలో పడ్డాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story