Deva Katta: సినిమా షూటింగ్ చేసింది నేను కాదు అని షాక్ ఇచ్చిన "రిపబ్లిక్" డైరెక్టర్

* రిపబ్లిక్ సినిమా విషయంలో సాయితేజ్ తనని ఎంకరేజ్ చేశాడని సైనికుడిలా అతనికి అండగా నిలిచారని చెప్పుకొచ్చాడు.

admin1
Published on: 29 Sept 2021 3:00 PM IST
Deva Katta Says in an Interview that Sai Dharam Tej Supported Me for Republic Movie
X

దేవా కట్టా - సాయి ధరమ్ తేజ్ (ఫోటో- ది హన్స్ ఇండియా)

Deva Katta: "ప్రస్థానం" సినిమా తప్ప దర్శకుడు దేవా కట్టా సినిమాలలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేవు. దేవ కట్టా దర్శకత్వం వహించిన "ఆటోనగర్ సూర్య" కొన్ని వివాదాల వల్ల కలెక్షన్ల వర్షం కురిపించి లేకపోయింది. ఆ తర్వాత దేవా "డైనమైట్" అనే రీమేక్ సినిమానే చేశారు. విష్ణు హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం దేవ కట్టా సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన "రిపబ్లిక్" అనే సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన దేవ కట్టా ఇప్పుడు చిత్ర ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉన్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవకట్టా తన "డైనమైట్" సినిమా గురించి కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టారు. తాను యూ ఎస్ నుంచి ఇండియా వచ్చిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆ సినిమా ఆఫర్ వచ్చిందని అందుకే ఆ సినిమాని ఒప్పుకున్నానని చెప్పారు దేవా. అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ లో తాను కేవలం తొమ్మిది రోజులు మాత్రమే పాల్గొన్నానని మిగతా భాగాన్ని వేరే వాళ్లను పెట్టి ఇష్టమొచ్చినట్లు సినిమా తీశారని ఆయన అన్నారు. అయితే రిపబ్లిక్ సినిమా విషయంలో సాయితేజ్ తనని ఎంకరేజ్ చేశాడని సైనికుడిలా అతనికి అండగా నిలిచారని చెప్పుకొచ్చాడు.

admin1

admin1

Next Story