"ఆర్ ఆర్ ఆర్" క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు

Details of the R R R Closing Collections
x

"ఆర్ ఆర్ ఆర్" క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు

Highlights

RRR Movie: ఫైనల్ రన్ లో "ఆర్ ఆర్ ఆర్" కలెక్షన్స్

RRR Movie: జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ''ఆర్.ఆర్.ఆర్'' సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. మార్చి 25న థియేటర్లలో విడుదలైన ఈ ప్యాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1118 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించారు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ మరియు అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, ఆలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియా, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఏరియా వైజ్ గా "ఆర్ ఆర్ ఆర్" క్లోజింగ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి:

నైజాం: 111.80 కోట్లు

సీడెడ్: 46 కోట్లు

యూఏ: 35.50 కోట్లు

నెల్లూరు: 10.50 కోట్లు

గుంటూరు: 18.10 కోట్లు

కృష్ణా: 14.70 కోట్లు

వెస్ట్: 13.25 కోట్లు

ఈస్ట్: 15.80 కోట్లు

ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ మొత్తం: 265.65 కోట్లు (394 కోట్ల గ్రాస్)

కర్ణాటక: 43 కోట్లు (83 కోట్ల గ్రాస్)

తమిళనాడు: 42.4 కోట్లు (80.5 కోట్లు గ్రాస్)

కేరళ: 10.6 కోట్లు (25.8 కోట్ల గ్రాస్)

నార్త్: 126 కోట్లు (324 కోట్ల గ్రాస్)

ఓవర్సీస్: 95 కోట్లు (210 కోట్లు గ్రాస్)

ప్రపచవ్యాప్తంగా: 582.65 కోట్లు (1117.30 కోట్ల గ్రాస్)

Show Full Article
Print Article
Next Story
More Stories