సినిమా పరిశ్రమకు కార్మిక శాఖ కొత్త నిబంధనలు.. సినిమాలో పని చేసే చైల్డ్ ఆర్టిస్టులకు కలెక్టర్ అనుమతి మస్ట్

Department of Labor New Regulations for the Film Industry About the Child Artist
x

సినిమా పరిశ్రమకు కార్మిక శాఖ కొత్త నిబంధనలు

Highlights

చైల్డ్ ఆర్టిస్ట్‌లకు కొత్త రూల్స్ 14 ఏళ్లలోపు పిల్లలు ఇకపై ఏ రంగాల్లో పని చేయకూడదు

Film Industry: బాల కార్మికుల నిర్మూళనకు కార్మిక శాఖ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. సినిమాలో పని చేసే చైల్డ్ ఆర్టిస్టులకు కలెక్టర్ అనుమతి తప్పనిసరి చేసింది. ఈ మెరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 14 సంవత్సరాల్లోపు పిల్లలు ఇకపై ఏ రంగాల్లో పని చేయకూడదు. సినిమాలో పని చేసే చైల్డ్ ఆర్టిస్టులకు కలెక్టర్ అనుమతి పత్రం తప్పనిసరి చేసింది. నిర్మాత, దర్శకుడు ఎవరైనా జిల్లా కలెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇక ముందు సినిమాల్లో బాల కార్మికుల పనితీరుపై కలెక్టర్ల అనుమతి కావాల్సిందే. అలాగే సంబందిత చైల్డ్ ఆర్టిస్ట్ నుండి అనుమతి కూడా తప్పనిసరి.

చైల్డ్ ఆర్టిస్ట్ విద్యకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు ఉండేలా చూసుకోవాలని ఉత్తర్వులలో పేర్కొంది. 14 ఏళ్లలోపు పిల్లలను ఎక్కడైనా పని చేయించుకొంటె కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 6 నెలల నుండి ఏడాది జైలు శిక్షతో పాటు 20 నుండి 50 వేల వరకు జరిమానా విధించనుంది. పనికి పంపించిన తల్లితండ్రులు కూడా శిక్షకు అర్హులే అని స్పష్టం చేసింది. సంబందిత బాలడు లేక బాలిక ఏ పాఠశాలలో అయిన 30 రోజులు గైర్హాజరు అయితే నోడల్ ఆఫీసర్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపింది కార్మిక శాఖ. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories