ఆదిపురుష్‌ చిత్ర యూనిట్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

*హిందువుల మనోభావాలు గాయపరిచారన్న పిటిషన్‌పై విచారణ

Rama Rao
Published on: 10 Oct 2022 5:26 PM IST
Delhi High Court Notices to Adipurush Film Unit | Telugu News
X

ఆదిపురుష్‌ చిత్ర యూనిట్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Delhi High Court: ఆదిపురుష్ చిత్ర యూనిట్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో తెర కెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సినిమాకు చెందిన టీజర్ ఇటీవలే రిలీజ్ కాగా పలు వర్గాలు టీజర్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆదిపురుష్ సినిమాలో హిందువుల మనోభావాలను గాయపరిచారంటూ ఓ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అంతేకాకుండా ఆదిపురుష్ సినిమా విడుదలపై స్టే విధించాలని కూడా సదరు సంస్థ కోర్టును కోరింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఆదిపురుష్ చిత్ర యూనిట్‌కు నోటీసులు జారీ చేసింది.

Rama Rao

Rama Rao

Next Story