Deepika Padukone: అదొక కొత్త ప్రపంచం అంటున్న దీపికా పడుకొనే

Deepika Padukone - Project K Movie: డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో చేస్తున్న "ప్రాజెక్ట్ కే" ఎలా ఉండబోతోందో చెప్పిన దీపికా

admin1
Published on: 15 Dec 2021 12:22 PM IST
Deepika Padukone Says About her Role in the Prabhas New Movie Project K
X

"ప్రాజెక్ట్ కే" ఎలా ఉండబోతోందో చెప్పిన దీపికా (ఫైల్ ఫోటో) 

Deepika Padukone - Project K Movie: ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "రాధేశ్యామ్". పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ "సలార్", "ఆదిపురుష్" వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాల తర్వాత ప్రభాస్ తన పూర్తి ఫోకస్ "మహానటి" సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో చేస్తున్న "ప్రాజెక్ట్ కే" పైనే పెట్టాలని నిర్ణయించుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ప్రభాస్ చాలానే కాల్షీట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోనే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీపిక ఈ సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. "ప్రాజెక్ట్ కే వీ ఎఫ్ ఎక్స్ లు బాగా ఉన్నా సినిమా. ఈ సినిమాలో చాలా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇందులో నా పాత్ర, సినిమా కథ ఒక కొత్త ప్రపంచం లాగా ఉంటుంది. షూటింగ్ మొదలు పెట్టాలని నాకు చాలా ఆసక్తిగా మాత్రమే కాక టెన్షన్ గా కూడా ఉంది ఎందుకంటే ఇదొక కొత్త జర్నీ" అని చెప్పుకొచ్చింది దీపికా.

admin1

admin1

Next Story