ఆసుపత్రిలో చేరిన దీపికా పదుకొణె.. కారణం ఏంటి..?

Deepika Padukone Rushed To Hospital After Feeling Uneasy
x

ఆసుపత్రిలో చేరిన దీపికా పదుకొణె.. కారణం ఏంటి..?

Highlights

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఆరోగ్యం గురించిన వార్తలు ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఆరోగ్యం గురించిన వార్తలు ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సోమవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి కి వెళ్ళిన "పద్మావత్" హీరోయిన్ పలు రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం. దీపికా స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆమెను వెంటనే ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీపికా ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది.

కొద్ది నెలల క్రితమే హైదరాబాద్‌లో "ప్రాజెక్ట్ కే" షూటింగ్ సమయంలో దీపికా కు సెట్ లో ఉన్నట్టుండి గుండె వేగంగా కొట్టుకోవడంతో చిత్ర బృందం ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. యితే అందులో నిజం లేదని మళ్లీ వార్తలు వినిపించాయి. కానీ తాజాగా మరోసారి దీపికా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యింది అంటూ ఇండస్ట్రీ లో పుకార్లు గుప్పుమంటున్నాయి.

మరోవైపు "పఠాన్" సినిమా సెట్ లో కూడా దీపికా కళ్ళు తిరిగి పడిపోయిందని తెలుస్తోంది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారని కూడా పుకార్లు వినిపించాయి. కానీ ప్రతిసారి దీపికా కి ఎందుకిలా జరుగుతోంది, ఆమె ఆరోగ్యానికి ఏమైంది అని ఆమె అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. పని ఒత్తిడి వల్ల ఆమె అనారోగ్యానికి గురవుతుందని కొందరు చెప్పుకొస్తున్నారు. దీపికా పదుకొణె ప్రస్తుతం షారుక్‌ ఖాన్‌ చిత్రం "పఠాన్‌" లో నటిస్తోంది. ఇదొక్కటే కాకుండా ఆమె చేతిలో ఇంకా బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories