Prabhas: ఆమె చాలా అందమైన అమ్మాయి.. ఎప్పటికీ అభిమానిస్తా..

Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సహనటి దీపికా పదుకొణెపై ప్రశంసల వర్షం కురిపించారు.

Arun Chilukuri
Published on: 3 Aug 2023 12:41 PM IST
Deepika Padukone is The Biggest Superstar Says Prabhas
X

Prabhas: ఆమె చాలా అందమైన అమ్మాయి.. ఎప్పటికీ అభిమానిస్తా..

Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సహనటి దీపికా పదుకొణెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె అంటే తనకు ఎప్పటికీ అభిమానమేనని అన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ ఇద్దరు కలిసి ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర విశేషాలు పంచుకునేందుకు ప్రభాస్‌ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోనే.. దీపికపై ప్రశ్న ఎదురవగా మనసులో మాట బయటపెట్టారు.

‘‘దీపికా చాలా పెద్ద సూపర్ స్టార్. చాలా అందమైన అమ్మాయి, ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా తన సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ‘కల్కి’ సెట్‌కి దీపికా వచ్చినప్పుడు అందరికి ఉత్సాహం వస్తుంది. తనతో ఎప్పట్నుంచో వర్క్ చేయాలనుకున్నాను. ఫైనల్‌గా నా కోరిక ఇప్పుడు తీరింది. ఆమెతో ఇదే మొదటిసారి వర్క్ చేస్తున్నాను. ఆమెను నటిగా చాలా ఇష్టపడతాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ చేసిన కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’లో అమితాబ్ బచ్చన్, కమలహాసన్ కూడా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా తొలుత ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో పట్టాలెక్కింది. ఇటీవల అమెరికాలో జరిగిన శాండియాగో కామిక్ కాన్ వేడుకలో చిత్రం బృందం టీజర్‌తో పాటూ సినిమా పేరును కూడా రివీల్ చేసింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story