రెండో సారి ముద్దు పెట్టిన విజయ్ దేవరకొండ

Ruthvik
Published on: 18 March 2019 8:44 AM IST
రెండో సారి ముద్దు పెట్టిన విజయ్ దేవరకొండ
X

వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకుంటున్న తెలుగు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ 'టాక్సీ వాలా' అనే సినిమాతో మరో హిట్ ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం అందరి కళ్ళు విజయ్ దేవరకొండ నటిస్తున్న తదుపరి సినిమా 'డియర్ కామ్రేడ్' పైనే ఉన్నాయి. 'గీత గోవిందంలో' విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేసిన రష్మీక మందన్న ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర టీజర్ నిన్న విడుదలైంది. ఇప్పటిదాకా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కాలేజ్ లీడర్ గా కనిపిస్తాడని వార్తలు వచ్చాయి.

టీజర్ లో జరిగే ఒక యాక్షన్ సన్నివేశం చూస్తే ఈ పుకార్లు నిజమేనా అని అర్థమవుతుంది. కాలేజిలో విద్యార్థుల మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. స్లో మోషన్ లో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చి ఒకరిని కొడతాడు. ఈ యాక్షన్ యాంగిల్ అవ్వగానే రొమాంటిక్ మూడ్ కి షిఫ్ట్ అయిన విజయ్ రష్మీక ను వర్షం లో ముద్దాడుతూ కనిపిస్తాడు. 'కడలల్లే వేచె కనులే కదిలేను నదిలా కలలే' అని బ్యాక్ గ్రౌండ్ లో సిడ్ శ్రీరాం పాడిన పాట హైలైట్. 'గీత గోవిందం' లోనే లిప్ లాక్ చూపించిన వీరు మళ్లీ ఈ సినిమాలో కూడా అదే ట్రెండ్ వాడారు.

Ruthvik

Ruthvik

Next Story