మహేశ్ ఫ్యాన్స్ లో జోష్ .. డేవిడ్ వార్నర్‌ 'మహర్షి' టీజర్‌ రిలీజ్

మహేశ్ అభిమనులను మరోసారి పలకరించారు డేవిడ్ వార్నర్.

Samba Siva Rao
Published on: 31 Dec 2020 6:05 PM IST
మహేశ్ ఫ్యాన్స్ లో జోష్ .. డేవిడ్ వార్నర్‌ మహర్షి టీజర్‌ రిలీజ్
X

ఆస్ట్రేలియా ఓపెనర్‌, సన్ రైజర్స్ జట్టు సారథి డేవిడ్‌ వార్నర్‌ 2020లో అభిమానులకు ఎంతగా అలరించాడో అందరికీ తెలిసిందే. ఈ ఏడాది కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ వార్నర్ అద్బుతంగా ఉపయోగించుకున్నాడు. టిక్‌టాక్‌ వీడియోలతో తెలుగు ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాడు. తెలుగు సినిమా పాటలు, డైలాగులతో పలువురు టాలీవుడ్‌ టాప్‌ హీరోల మీద వీడియోలు రూపొందించాడు.

కాగా, మరికొద్దిగంటల్లో ఈ ఏడాది ముగియనుండటంతో వార్నర్ మరో వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన 'మహర్షి' సినిమా టీజర్‌ను ఎడిట్‌ చేసి.. అందులోని సన్నివేశాలకు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. స్కూటర్‌పై మహేశ్‌.. వెన్నెల కిషోర్‌తో వెళ్లే సీన్‌తో పాటు డైలాగులు, ఫైటింగ్‌ల సీన్లలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌‌ అదరగొట్టాడు. ఆ వీడియోను ఇన్‌స్టాలో పంచుకోవడంతో అభిమానులు లైకులు కొడుతున్నారు. ఈ వీడియో చూస్తే వార్నర్ కు తెలుగు సినిమాలపై ఎంత అభిమానం ఉందో అర్థమవుతుంది. మహేశ్ అభిమానులైతే వార్నర్ ను ఓ రేంజ్ లో పొగుడుతన్నారు. గతంతో కూడా వార్నర్ సరిలేరూనీకెవ్వరూ సినిమాలోకి మైండ్ బ్లాక్ సాంగ్ కు స్టేప్పులేసిన సంగతి తెలిసిందే




Samba Siva Rao

Samba Siva Rao

Next Story