Dasara Movie: మంచి ప్రమోషనల్ స్ట్రాటజీ తో నాని "దసరా" బృందం

Dasara Movie: లక్నో లో విడుదల ప్లాన్ చేస్తున్న "దసరా" టీమ్..

Dhatripriya
Updated on: 7 March 2023 8:30 PM IST
Dasara Team With Good Promotional Strategy
X

Dasara Movie: మంచి ప్రమోషనల్ స్ట్రాటజీ తో నాని "దసరా" బృందం

Dasara Movie: నాచురల్ స్టార్ నాని హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "దసరా". శ్రీకాంత్ ఓదెల అనే ఒక కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. తెలంగాణ వద్ద గోదావరిఖని లోని బొగ్గు గని బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో నాని ఇంతకుముందు ఎన్నడూ కనిపించినటువంటి ఒక రస్టిక్ లుక్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

నాని కరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఈనెల 30వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాక ప్యాన్ ఇండియా రేంజ్ లో తమిళ్, మలయాళం, కన్నడ, మరియు హిందీ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. మిగతా భాషల్లో ముఖ్యంగా హిందీలో ఈ సినిమా ప్రమోషన్లు ఎక్కువగానే చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ఒక పెద్ద ప్రమోషన్ స్ట్రాటజీతో రాబోతోంది.

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అన్ని భాషల్లోనూ విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది. అయితే ఈసారి చిత్ర ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇక్కడ కాకుండా నార్త్ లో విడుదల చేస్తే బాగుంటుందని సినిమాకి హైప్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం దసరా చిత్ర బృందం సినిమా ట్రైలర్ ను లక్నో లో విడుదల చేయబోతోంది. మరి ఈ స్ట్రాటజీ చిత్ర బృందానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

Dhatripriya

Dhatripriya

Next Story