"శ్యామ్ సింగారాయి" రికార్డు బ్రేక్ చేసిన "దసరా"

Dasara Movie: రికార్డు స్థాయిలో అమ్ముడైన "దసరా" నాన్ థియేట్రికల్ రైట్స్

Rama Rao
Updated on: 30 March 2022 10:00 PM IST
Dasara Movie Non-Theatrical Rights Sold at Record Levels
X

 "శ్యామ్ సింగారాయి" రికార్డు బ్రేక్ చేసిన "దసరా"

Dasara Movie: ఈ మధ్యనే "శ్యామ్ సింగారాయి" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని చేతిలో ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. "అంటే సుందరానికి", "దసరా" సినిమా లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని. అందులో "అంటే సుందరానికి" సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తయింది. మంచి అంచనాల మధ్య ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా తర్వాత "దసరా" ఒక పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని పక్క మాస్ రోల్ చేయబోతున్నారు.

స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. తాజా సమాచారం ప్రకారం రికార్డు స్థాయిలో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ అమ్ముడయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా థియేట్రికల్ రైట్స్ తోనే దర్శకనిర్మాతలు 45 కోట్లు చేజిక్కించుకున్న ట్లుగా తెలుస్తోంది. "శ్యామ్ శింగారాయి" థియేట్రికల్ రైట్స్ 35 కోట్లు కాగా "దసరా" మాత్రం 45 కోట్లతో రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story