Srikanth Odela: దసరా డైరెక్టర్‌కి బంఫర్ ఆఫర్.. ఐకాన్ స్టార్‌తో నెక్స్ట్ మూవీ..?

Srikanth Odela: నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

Arun Chilukuri
Published on: 1 July 2023 1:14 PM IST
Dasara Director Srikanth Odela Movie With Allu Arjun
X

Srikanth Odela: దసరా డైరెక్టర్‌కి బంఫర్ ఆఫర్.. ఐకాన్ స్టార్‌తో నెక్స్ట్ మూవీ..?

Srikanth Odela: నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కాగ శ్రీకాంత్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం బాగానే వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి భారీ కలెక్షన్లు లభించాయి. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో శ్రీకాంత్ ఓదెలాకి ఇప్పుడు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇక శ్రీకాంత్ తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం త‌న త‌దుప‌రి సినిమాను టాలీవుడ్ టాప్ హీరోతో శ్రీకాంత్ ఓదెల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ హీరో మ‌రెవ‌రో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌.

శ్రీకాంత్ ఓదెల డైరెక్ష‌న్ స్టైల్‌కు అల్లు అర్జున్ ఇంప్రెస్ అయిన‌ట్లు స‌మాచారం. అందుకే అత‌డితో క‌లిసి సినిమా చేయాల‌ని ఫిక్స్ అయిన‌ట్లు చెబుతోన్నారు. ఇప్ప‌టికే బ‌న్నీని క‌లిసిన శ్రీకాంత్ ఓదెల అత‌డికి ఓ పాయింట్‌ను వినిపించిన‌ట్లు తెలిసింది ఈ పాయింట్‌ బ‌న్నీకి న‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వెంటనే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేయమని చెప్పాడట బన్నీ. దసరా సినిమా లాగే.. తన రెండో సినిమా కోసం కూడా రా అండ్ రస్టిక్ కాన్సెప్ట్ నే తీసుకున్నాడట శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనుందని సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్టు పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story