Dasara Movie: తెలుగు తప్ప మిగతా భాషల్లో యావరేజ్ గా ఉన్న "దసరా" కలెక్షన్లు

Dasara Movie: తెలుగు తప్ప మిగతా భాషల్లో యావరేజ్ గా ఉన్న "దసరా" కలెక్షన్లు

Dhatripriya
Published on: 1 April 2023 2:30 PM IST
Dasara Collections Are Average In Other Languages
X

Dasara Movie: మిగతా రాష్ట్రాల్లో కేవలం పర్వాలేదు అనిపించిన నాని "దసరా" 

Dasara Movie: నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన "దసరా" భారీ అంచనాల మధ్య మార్చి 30న థియేటర్లలో విడుదలైంది. విడుదల కి ముందు నుంచే మంచి హైప్ అందుకున్న ఈ సినిమా విడుదలైన తరువాత కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. తెలుగులో మాత్రమే కాక ఈ సినిమా తమిళ్, హిందీ, కన్నడ, మరియు మలయాళం భాషల్లో కూడా విడుదల సంగతి తెలిసిందే. అన్ని భాషల్లోనూ చిత్ర బృందం భారీ స్థాయిలో ప్రమోషన్లు కూడా చేశారు.

ముఖ్యంగా హిందీలో ప్రతి రాష్ట్రానికి వెళ్లి రెండు వారాల పాటు నాని సినిమాని ప్రమోట్ చేశారు. కానీ ఎంత కష్టపడి ప్రమోషన్లు చేసినప్పటికీ మిగతా భాషల్లో ఈ సినిమాకి మొదటి రోజు కలెక్షన్లు అంతగా అందలేదు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజున ఈ సినిమా 13.4 కోట్ల కలెక్షన్లు నమోదు చేసుకోగా ప్రపంచవ్యాప్తంగా సినిమా కలెక్షన్లు 19.4 కోట్లకు చేరుకున్నాయి.

విజయ్ దేవరకొండ లైగర్ (14 కోట్లు) సినిమా కలెక్షన్లను ఈ చిత్రం బద్దలు కొట్టింది. రెండవ రోజు కూడా సినిమా బాగానే మొదలైంది. వర్డ్ అఫ్ మౌత్ కూడా బాగానే ఉండటంతో వారాంతంలో సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. నాలుగు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ ని కూడా చేరుకునే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

Dhatripriya

Dhatripriya

Next Story