Dasara 2020 : దసరా వేడుకల్ని మరింత శోభాయమానం చేసే సినీ గీతాలు కొన్ని..

Dasara 2020 : దసరా వేడుకల్ని మరింత శోభాయమానం చేసే సినీ గీతాలు కొన్ని..
x
Highlights

Dasara 2020: అమ్మవారిని కీర్తిస్తూ తెలుగు సినిమాల్లో ఎన్నో పాటలు వచ్చాయి. వాటిలో పాప్యులర్ అయిన కొన్ని పాటలు దసరా సందర్భంగా

దసరా పండగ అంటే అమ్మవారికి నవరాత్రులు జరుపుకుంటారు. నవరాత్రుల ఉత్సవాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఉదయం అంతా ఆధ్యాత్మికంగా అమ్మవారికి పూజలు చేసే భక్తులు సాయంత్రం వివిధ కళారూపాలతో కాలక్షేపం చేస్తారు. కొన్ని చోట్ల రాధయాత్రలు.. కొన్ని చోట్ల గర్బా నృత్యాలు.. మరి కొన్ని చోట్ల స్థానిక కలరూపాలతో సందడి చేస్తారు. ఇక మన సినిమాలలోనూ అమ్మవారి పాటలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఆధ్యాత్మిక ఒరవడిలో వచ్చే పాటలకు ఎప్పుడూ ప్రేక్షక ఆదరణ ఉంటుంది. పండుగ రొజులలో ఆ పాటలు విపరీతంగా ప్రాచుర్యం పొందుతాయి. దసరా పండుగ సందర్భంగా అలా ప్రాచుర్యం పొందిన కొన్ని అమ్మవారి పాటలు చూద్దాం..

1. మహా కనుకదుర్గ విజయ కనుకదుర్గ : దేవుళ్ళు

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా .. పరాశక్తి లలితా శివానంద చరితా.. అంటూ సాగే ఈ పాట దేవుళ్ళు సినిమాలోనిది.. అమ్మవారి ప్రత్యేకతను చెప్పే విధంగా ఈ పాట ఉంటుంది. ఈ పాటను జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రాయగా వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. ఇక ఈ పాటను జానకీ ఆలపించారు. రమ్యకృష్ణ పైన ఈ పాటను చిత్రీకరించారు.

2. అమ్మ భవాని లోకలనేలే ఓంకార రూపం అమ్మ .. : శివరామరాజు

అమ్మ భవాని లోకలనేలే ఓంకార రూపమమ్మ.. తల్లి నీ మహిమల్ని చూపవమ్మ..అంటూ సాగే ఈ పాట శివరామరాజు చిత్రంలోనిది.. ఎస్ ఎ రాజుకుమార్ సంగీత సారధ్యంలో ఎస్పీ బాలు ఈ పాటను పాడగా జగపతి బాబు, శివాజీ, వెంకట్ లపైన ఈ పాటను చిత్రీకరించారు.

3. అమ్మ.. అమ్మోరు తల్లో : అమ్మోరు

అమ్మ అమ్మోరు తల్లి అంటూ సాగే ఈ పాట అమ్మోరు సినిమాలోనిది.. సౌందర్య, సురేష్ హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమాలో రమ్యకృష్ణ దేవతగా కనిపించింది.. ఆమె పైన చిత్రీకరించిన అమ్మ.. అమ్మోరు తల్లో పాట అందరిని అలరిస్తుంది.. ఈ పాటను రసరాజు లిరిక్స్ అందించగా, చిత్ర ఈ పాటను ఆలపించారు.. కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి సంగీతం అందించారు.

4. అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే : సప్తపది

"అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే" ఆది శంకరాచార్యుల వారు అమ్మవారిని కీర్తించిన గానం సప్తపది సినిమాలో కేవీ మహదేవన్ సంగేతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ పాట వచ్చే సందర్భం.. దాని వెనుక నేపధ్యం కే.విశ్వనాద్ అద్భుతంగా ఆవిష్కరించారు. మన దేశంలో స్త్రీ మూర్తిని అమ్మవారిగా ఎలా గౌరవిస్తామో అది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇక ఈ పాట అప్పటికీ ఇప్పటికీ దసరా వచ్చిందంటే ఉత్సవాల్లో కచ్చితంగా వినిపిస్తుంది.

5. దసరా వచ్చిందయ్యా.. సరదా తెచ్చిందయ్యా.. : లారీ డ్రైవర్

దసరా వచ్చిందయ్యా.. సరదా తెచ్చిందయ్యా.. దశమి వచిందయ్యా దశనే మార్చిందయ్యా అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. చక్రవర్తి సంగీత సారధ్యంలో వచ్చిన ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర కలిసి ఆలపించారు. ఈ పాటకి బాలకృష్ణ, విజయశాంతి స్టెప్పులు వేశారు. ఇప్పటికీ జన బాహుళ్యంలో దసరా వచ్చిందంటే ఈ పాట నలుగుతూనే ఉంటుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories