Das Ka Dhamki: మొదటి రోజే సగం రికవరీ చేసిన విశ్వక్ సేన్ సినిమా

Das Ka Dhamki: మొదటి రోజే సగం రికవరీ చేసిన విశ్వక్ సేన్ సినిమా

Dhatripriya
Published on: 24 March 2023 11:53 AM IST
Das Ka Dhamki Collections On First Day Were Shocking
X

Das Ka Dhamki: మొదటి రోజు "దాస్ కా ధమ్ కీ" కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలుసా?

Vishwak Sen: యువ హీరో విశ్వక్ సేన్ ఈ మధ్యనే "దాస్ కా ధమ్ కీ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. "ఫలక్నుమా దాస్" తరువాత విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో నటించిన రెండవ సినిమా ఇది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ సినిమా మొన్న అనగా మార్చి 22న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 8 కోట్లకు అమ్ముడయ్యాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మొదటి రోజే ఈ సినిమా 50% రికవరీ చేసేసింది. ఓపెనింగ్ డే రోజే ఈ సినిమా షేర్లు నాలుగు కోట్లు దాటాయి. పైగా ఉగాది సందర్భంగా విడుదలైన ఈ సినిమాకి హాలిడే అడ్వాంటేజ్ కూడా దొరకడంతో మంచి కలెక్షన్లు లభించాయి. ఇక టాక్ పరంగా కూడా ఈ సినిమా మంచి రివ్యూస్ నే అందుకుంటుంది. ఇక కలెక్షన్ల పరంగా ఇదే జోరు కొనసాగిస్తే సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా వారాంతం కూడా కలెక్షన్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ఓవర్సీస్ లో కూడా సినిమా కలెక్షన్లు బాగానే ఉన్నాయి. మొదటి రోజు అమెరికాలో సినిమా కలెక్షన్లు లక్షన్నర డాలర్లకు చేరుకుంది. విశ్వక్ సేన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో నివేత పేతురేజ్ హీరోయిన్ గా నటించింది. రావు రమేష్, అక్షర గౌడ లు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకి కథను అందించారు. దర్శకత్వం తో పాటు స్క్రీన్ ప్లే మరియు డైలాగులు కూడా విశ్వక్ సేన్ అందించారు. లియోన్ జేమ్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.

Dhatripriya

Dhatripriya

Next Story