త్వరలో చెన్నై వెళ్లనున్న 'దర్బార్' బృందం

త్వరలో చెన్నై వెళ్లనున్న దర్బార్ బృందం
x
Highlights

ఈ మధ్యనే 'పెట్ట' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న...

ఈ మధ్యనే 'పెట్ట' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. 'దర్బార్' అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ముంబై షెడ్యూల్ ఈ నెల మూడవ వారంలో పూర్తికానున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తర్వాత చిత్రబృందం చెన్నై కి వెళ్ళనుంది.

అక్కడ సినిమా షూటింగ్ లోని కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఈ నెలాఖరు నుంచి చెన్నై లో షూటింగ్ జరగనుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా రజనీకాంత్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ప్రకాష్ రాజ్, నివేదాథామస్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories