Dangerous: ప్రేమ‌లో ప‌డిన‌ హీరోయిన్స్..రచ్చ రచ్చ..సోషల్ మీడియాలో వైరల్

Dang Official Trailer Goes Viral
x

డేంజరస్ మూవీ

Highlights

Dangerous: తాజాగా వ‌ర్మ కంపెనీ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'డేంజరస్,

Dangerous: క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం అన్ని రంగాల‌పై ప‌డింది. ఇక సినీ ఇండ‌స్ట్రీపై క‌రోనా ప్ర‌భావం తీవ్రంగానే ఉంద‌ని చెప్పాలి. 2020లో క‌రోనా కార‌ణంగా అనేక సినిమాలు విడుద‌ల‌కు నోచుకోలేదు. దీంతో సినిమాలు అన్ని ఓటీటీ వేదిక‌గా రిలీజ్ కావ‌డం మొద‌లు పెట్టాయి. ఈ ఏడాది మొద‌ట్లో క‌రోనా ప్ర‌భావం త‌గ్గి ప‌రిస్థితులు కుదుట‌ప‌డ‌డంతో సినిమాలు రిలీజులు ఊపందుకున్నాయి. క‌రోనా సెకండ్ వేవ్ పుణ్య‌మా అని మ‌ళ్లీ గ‌డ్డుప‌రిస్థితులు వ‌చ్చాయి. థియేట‌ర్లు మూత‌ప‌డే స‌రికి కొన్ని సినిమాల‌కు ఓటీటీనే ప్ర‌త్యామ్న‌యంగా క‌నిపించింది. పెద్దహీరోల నుంచి చిన్న‌హీరోల చిత్రాల వ‌ర‌కు అన్ని సినిమాల షూటింగులు నిలిచిపోయాయి.

గ‌త ఏడాది అన్ని సినిమాల షూటింగులు నిలిచిపోతే..ఆర్జీవీ ఏకంగా క‌రోనా వైర‌స్ అనే సినిమా ప్రొమో వ‌ద‌లి సంచ‌ల‌నం సృష్టించాడు. తాజాగా రామ్ గోపాల్ వ‌ర్మ ఓటీటీ వేదిక‌గా వ‌రుస సినిమాల‌తో దాడి చేయ‌నున్నాడు. ఇవాళ దావుద్ ఇబ్ర‌హిం జీవిత క‌థ ఆదారంగా డి కంపెనీ అనే సినిమా విడుద‌ల అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర్మ తీసిన సినిమాలు వ్య‌క్తుల చరిత్ర‌లు, రాజ‌కీయ‌లు, దెయ్యాల క‌థ‌ల నేప‌థ్యంలో వ‌చ్చిన‌వే. తాజాగా వ‌ర్మ కంపెనీ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'డేంజరస్,


ఇందులో ఏముంది ఇదో హ‌ర్ర‌ర్ మూవీనే క‌దా అనుకంటారెమో... ఇదో బోల్డ్ మూవీ ఆర్జీవీ డేంజరస్ అనే బోల్డ్ మూవీ త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఈ మూవీలో ఇద్దరు యంగ్ హీరోయిన్లను లెస్బియన్స్‌గా కనిపించనున్నారు. యంగ్ హీరోయిన్లను అప్సర రాణి, నైనా గంగూలీ ప్రేమికులుగా నటించారు. స్త్రీ, పురుషుల మధ్య మాత్రమే ప్రేమ ఉండదని.. ఇద్దరు మ‌హిళ‌ల మ‌ధ్య కూడా గాఢంగా ప్రేమించుకుంటారని ఈ చిత్రంలో చూపించబోతున్నారంట వ‌ర్మ‌.


లైలా-మజ్నూ, రోమియో-జూలియెట్‌లా ప్రేమలో ముగి తేలితో ఎలా ఉంటుందో ఇద్దరు అమ్మాయిలు ప్రేమ కూడా అలానే ఉంటుందంట‌మొట్ట మొదటి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ సినిమా ఇదేనని వ‌ర్మ‌ అంటున్నారు. డేంజరస్ మూవీ ట్రైలర్ యూట్యూబ్‌ను షేర్ చేస్తోంది. నెటిజ‌న్స్ ఓ రెంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ లొనే స్పార్క్‌(SPARK)లోనే డేంజరస్ చిత్రం విడుదలకానుంది.ఈ మూవీకి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories