తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదరప్రసాద్

*జెమిని కిరణ్‌పై 24 ఓట్ల తేడాతో దామోదరప్రసాద్ గెలుపు

Jyothi
Published on: 19 Feb 2023 5:18 PM IST
Damodar Prasad as the President of Telugu Producers Council
X

తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదరప్రసాద్

Telugu Film Producer Council: తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదరప్రసాద్ గెలుపొందారు. జెమిని కిరణ్ పై 24 ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్ విజయం సాధించారు. నిర్మాల మండలిలో మొత్తం సభ్యులు 1,134 మంది ఉండగా.. 678 ఓట్లు పోలయ్యాయి. ఉపాధ్యక్ష పదవికి సుప్రియ అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా ప్రసన్నకుమార్, వైవీఎస్ చౌదరి గెలవగా... జాయింట్ సెక్రటరీగా భరత్ చౌదరి, నట్టికుమార్ గెలుపొందారు. ఈసీ మెంబర్లుగా దిల్‌రాజు, దానయ్య, రామకృష్ణగౌడ్ విజయం సాధించారు. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో.. చిన్న నిర్మాతలు ఆందోళనకు దిగారు. దీంతో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించింది.

Jyothi

Jyothi

Next Story