Rana - Sharwanand: మరో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్న రానా దగ్గుబాటి

* మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు * కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం

admin1
Updated on: 29 Sept 2021 5:30 PM IST
Daggubati Rana to do a Multi Starrer Movie with Sharwanand
X

శర్వానంద్ - దగ్గుబాటి రానా (ఫోటో- ది హన్స్ ఇండియా)

Rana - Sharwanand: ఈ మధ్యకాలంలో కేవలం మల్టీస్టారర్ సినిమాల పైన మొగ్గు చూపిస్తున్నారు హీరో రానా దగ్గుబాటి. బాహుబలి సినిమాలో విలన్ పాత్ర పోషించిన రానా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి "భీమ్లా నాయక్" అనే మల్టీస్టారర్ సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈమధ్యనే "అరణ్య" సినిమాతో డిజాస్టర్ అందుకున్న రానా ఇప్పుడు మరో హీరోతో సినిమా మల్టీ స్టారర్ చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. ఆ హీరో ఎవరో కాదు శర్వానంద్.

ఈ మధ్యనే తమిళంలో సూపర్ హిట్ అయిన 96 సినిమాకి రీమేక్ గా వచ్చిన "జాను" సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న శర్వానంద్ ప్రస్తుతం "ఆర్ఎక్స్ 100" ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో "మహాసముద్రం" అనే సినిమాతో బిజీగా ఉన్నారు.

తాజా సమాచారం ప్రకారం శర్వానంద్ మరియు రానా ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఒక కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం. సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

admin1

admin1

Next Story