HBD Rana : 'కామ్రేడ్ రవన్న' గా రానా దగ్గుబాటి!

ఇందులో రానా 'కామ్రేడ్ రవన్న' గా నటిస్తున్నాడు. ఈ వీడియోలో ‘ఈ దేశం ముందు ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది, సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది’అంటూ రానా పాత్రను పరిచయం చేశారు.

Krishna
Published on: 14 Dec 2020 2:48 PM IST
HBD Rana : కామ్రేడ్ రవన్న గా రానా దగ్గుబాటి!
X

HBD Rana : విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా నేడు 37 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా ప్రస్తుతం రానా నటిస్తున్న "విరాటపర్వం" సినిమాలోని రానా పాత్రను రివీల్ చేస్తూ ఓ వీడియో గ్లిమ్స్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది.. ఇందులో రానా 'కామ్రేడ్ రవన్న' గా నటిస్తున్నాడు. ఈ వీడియోలో 'ఈ దేశం ముందు ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది, సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది'అంటూ రానా పాత్రను పరిచయం చేశారు.

సినిమా మొత్తం 90వ కాలం చూట్టూ తిరుగుతుంది. అప్పటి నాటి నక్సల్స్‌ వాతావరణం, నల్లమల అడవులు, చేతిలో తుపాకితో, మావోయిస్టు డాక్టర్‌ రవిశంకర్‌ అలియాస్‌ కామ్రేడ్‌ రవన్న పాత్రలో రానా చాలా కొత్తగా కనిపిస్తూ సినిమా పైన ఆసక్తిని పెంచాడు. ఇక ఈ సినిమాలో రానాతో పాటుగా ప్రియమణి, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ వలన వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ తాజాగా మొదలై శేరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.


Krishna

Krishna

Next Story