'దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్స్‌ సౌత్‌ 2020' జాబితా ఇదే

దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్స్‌ సౌత్‌ 2020 జాబితా ఇదే
x
Highlights

సౌత్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకులుగా పేరుపొందిన నాగార్జున, అజిత్‌, మోహన్‌లాల్‌, శివరాజ్‌ కుమార్‌లకు మోస్ట్‌ వర్సటైల్‌ యాక్టర్స్‌‌గా ‘దాదాసాహెబ్‌ ఫాల్కే సౌత్‌ 2020’ అవార్డు వరించింది.

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని 'దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్స్‌ సౌత్‌ 2020' జాబితాను ప్రకటించారు. సౌత్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకులుగా పేరుపొందిన నాగార్జున, అజిత్‌, మోహన్‌లాల్‌, శివరాజ్‌ కుమార్‌లకు మోస్ట్‌ వర్సటైల్‌ యాక్టర్స్‌‌గా 'దాదాసాహెబ్‌ ఫాల్కే సౌత్‌ 2020' అవార్డు వరించింది. తమిళంలో ఉత్తమ నటిగా జ్యోతిక (రాచ్చసి) ఎంపికవ్వగా.. తెలుగులో 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రానికి గాను టాలీవుడ్‌ నుంచి ఉత్తమనటిగా రష్మిక, కన్నడలో తన్యా హోప్‌ (యజమాన), మళయాళంలో ఉత్తమ నటి పార్వతి(ఉయారే) అవార్డులను దక్కించుకున్నారు.

ఈ అవార్దులు దక్కించుకున్నవారు వీరే

తమిళంలో

మోస్ట్‌ వర్సటైల్‌ యాక్టర్‌ అజిత్‌, ఉత్తమ నటుడు ధనుష్‌ (అసురన్‌), ఉత్తమ నటి జ్యోతిక (రాచ్చసి), ఉత్తమ దర్శకుడు పార్థివన్‌ (ఒథా సెరుప్పు సైజ్‌ 7)ఉత్తమ చిత్రం టు లెట్‌, ఉత్తమ సంగీత దర్శకుడు అనిరుధ్‌ అవార్డులు వరించాయి.

మలయాళంలో

మోస్ట్‌ వర్సటైల్‌ యాక్టర్‌ మోహన్‌లాల్‌, ఉత్తమ నటుడు సూరజ్‌ వెంజరమూడు (ఆండ్రాయిడ్‌ కట్టప్ప వెర్షన్‌ 5.25), ఉత్తమ నటి పార్వతి(ఉయారే), ఉత్తమ దర్శకుడు మధు సి.నారాయణ్‌ (కుంబలంగి నైట్స్) , ఉత్తమ చిత్రం ఉయారే, ఉత్తమ సంగీత దర్శకుడు దీపక్‌ దేవ్ కు అవార్డులు దక్కాయి.‌

కన్నడలో

మోస్ట్‌ వర్సటైల్‌ యాక్టర్‌ శివరాజ్‌కుమార్,‌ ఉత్తమ నటుడు రక్షిత్‌ శెట్టి (అవనే శ్రీమన్నారయణ), ఉత్తమ నటి తన్యా హోప్‌ (యజమాన) ఉత్తమ దర్శకుడు రమేష్‌ ఇంద్ర (ప్రిమియర్‌ పద్మిణీ), ఉత్తమ చిత్రం మూకజ్జియ కనసుగళు, ఉత్తమ సంగీత దర్శకుడు హరికృష్ణ ఎంపికైయ్యారు.

తెలుగులో మోస్ట్‌ వర్సటైల్‌ యాక్టర్‌ నాగార్జున, ఉత్తమ నటుడు నవీన్‌ పొలిశెట్టి (ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ), ఉత్తమ నటి - రష్మిక (డియర్‌ కామ్రేడ్‌), ఉత్తమ దర్శకుడు - సుజీత్‌ (సాహో) ఉత్తమ చిత్రం - జెర్సీ, ఉత్తమ సంగీత దర్శకుడు - ఎస్‌.తమన్‌

Show Full Article
Print Article
Next Story
More Stories