MAA Elections: మా అధ్యక్ష బరిలో 5వ అభ్యర్థి

MAA Elections: మా అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న సి.వి.ఎల్. నర్సింహారావు * తెలంగాణ నినాదంతో పోటీలో దిగుతున్న నటుడు

Sandeep Eggoju
Updated on: 28 Jun 2021 9:30 AM IST
CVL Narasimharao Going to be Joined in MAA President Elections Competition
X
సీవీఎల్ నరసింహారావు (ఫైల్ ఇమేజ్)

MAA Elections: మా ఎన్నికలు అంతకంతకు ఉత్కంఠగా మారుతున్నాయి. ఎప్పుడూ లేనంతగా ఈసారి నలుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ జాబితాలోకి మరో నటుడి పేరు వచ్చి చేరింది. తెలుగు చిత్రపరిశ్రమలో విభిన్నమైన పాత్రలు పోషించిన నటుడు సీవీఎల్‌ నరసింహారావు ఈ సారి అధ్యక్ష ఎన్నికలో తలపడనున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. మా అసోసియేషన్‌ను కూడా రెండుగా విభజించాలని.. ఆంధ్ర, తెలంగాణ ప్రాంత చిన్న కళాకారుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తానని వెల్లడించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story