Bangarraju: బంగార్రాజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను - నాగార్జున

Crucial update on Nagarjunas Bangarraju | Tollywood New Movie Updates
x

నాగార్జున (ఫొటో ట్విట్టర్)

Highlights

Bangarraju: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజా సినిమా 'వైల్డ్‌డాగ్' ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.

Bangarraju: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజా సినిమా 'వైల్డ్‌డాగ్' ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలని చూస్తున్నాడు నాగార్జున. తాజాగా తన సూపర్ హిట్ సినిమా 'సోగ్గాడే చిన్ని నాయనా' సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

'బంగార్రాజు' గా రానున్న ఈ సినిమాను కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం చేయనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సింది. కానీ, కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఇటీవల, ఒక ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ, 'బంగార్రాజు' సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ ఏడాది షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇది నేను చేసిన వినోదాత్మక పాత్రలలో ఒకటి అవుతుందని' అన్నారు.

ఈ చిత్రంలో రమ్య కృష్ణ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అనుకున్న షెడ్యూల్ మేరకు ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories