David Warner Wishes To Mahesh Babu : తనదైన స్టైల్ లో మహేష్ కి విషెస్ అందించిన వార్నర్!

David Warner Wishes To Mahesh Babu : తనదైన స్టైల్ లో మహేష్ కి విషెస్ అందించిన వార్నర్!
x
mahesh babu david warner (File Photo)
Highlights

David Warner Wishes To Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు తన 45వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా

David Warner Wishes To Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు తన 45వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా అభిమానులు మాత్రమే కాదు.. సినీ, రాజకీయ క్రీడా ప్రముఖులు కూడా మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే ఆస్ట్రేలియా క్రికెట‌ర్ డేవిడ్ వార్నర్‌.. మ‌హేష్‌కి త‌న‌దైన స్టైల్‌లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

వార్నర్ లాక్‌డౌన్ స‌మ‌యంలో స‌రిలేరు నీకెవ్వరు చిత్రంలోని మైండ్ బ్లాక్ అనే సాంగ్‌కి త‌న భార్యతో క‌లిసి చేసిన డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించారు. హ్యాపీ బ‌ర్త్‌డే లెజెండ్ మ‌హేష్ అంటూ వార్నర్ ట్వీట్ చేశాడు. డేవిడ్ వార్నర్‌ నుంచి మహేష్ కు విషెస్ అందడంతో మహేష్ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు.

అటు లాక్ డౌన్ వ‌ల‌న క్రికెట్‌కి దూరంగా ఉన్న డేవిడ్ వార్నర్‌ తన ఫ్యామిలీతో కలిసి సినిమా ప‌రిశ్రమ‌కి సంబంధించిన సినిమాల‌లోని హిట్ సాంగ్స్‌కి, డైలాగ్స్ కి టిక్ టాక్ వీడియోలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచాడు..ఈ వీడియోలు తెలుగు ప్రేక్షకులను ఎంత‌గానో అలరించాయి. ప్రస్తుతం ఐపీఎల్ టోర్నమెంట్ కోసం సిద్ధమ‌వుతున్నాడు ఈ ఆసీస్ చిచ్చరపిడుగు.

Show Full Article
Print Article
Next Story
More Stories