ప్రమోషనల్ కంటెంట్ తో సమంత సినిమాపై తగ్గిపోతున్న క్రేజ్

* "శాకుంతలం" ప్రమోషనల్ కంటెంట్ తో నిరాశ చెందుతున్న అభిమానులు

Dhatripriya
Updated on: 26 March 2023 2:01 PM IST
Craze For Samantha Cinema Is Decreasing With Promotional Content
X

ప్రమోషనల్ కంటెంట్ తో సమంత సినిమాపై తగ్గిపోతున్న క్రేజ్

Shaakuntalam: స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్గా నటిస్తున్న "శాకుంతలం" సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది. ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్లతో బిజీగా ఉంది. సమంత కూడా పలు ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం సినిమాలోని కీలక నటీనటులకు సంబంధించి సెపరేట్ పోస్టర్లను కూడా విడుదల చేసింది. కానీ పోస్టర్ల వల్ల సినిమాపై బజ్ పెరగకుండా తగ్గుతోందని కొందరు చెబుతున్నారు.

ఇప్పటికే సినిమాకి సంబంధించిన టీజర్ ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. దీనివల్ల సినిమా బిజినెస్ కూడా బాగా తగ్గిపోయింది. ఇప్పుడు విడుదలైన పోస్టర్లకి కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కమర్షియల్ సినిమా కాకుండా మైథాలజికల్ సినిమా కాబట్టి ప్రమోషనల్ కంటెంట్ కూడా చాలా బాగుండాలి. అప్పుడే సినిమాని చూడడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తారు. ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న డీటెయిల్ కూడా సినిమా రిసల్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషనల్ కంటెంట్ మీద ఏ మాత్రం జాగ్రత్త వహించకుండా ఇలా నిర్లక్ష్యం చేయటం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది.

భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా తెలుగులో మాత్రమే కాక తమిళ్, హిందీ, మలయాళం, మరియు కన్నడ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఈ సినిమా త్రీడీలో కూడా విడుదల కాబోతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో దేవ్ మోహన్, అల్లు అర్హ, ప్రకాష్ రాజ్, గౌతమి, సచిన్ కేడేకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story