COVID Vaccine: నిర్మాత సురేష్‌బాబును బురిడీ కొట్టించిన కేటుగాడు

COVID Vaccine: నిర్మాత సురేష్‌బాబును ఓ కేటుగాడు బురిడీ కొట్టించాడు.

Arun Chilukuri
Updated on: 22 Jun 2021 12:33 PM IST
Suresh Babu Duped by an Unknown Person
X

సురేష్‌బాబు(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

COVID Vaccine: నిర్మాత సురేష్‌బాబును ఓ కేటుగాడు బురిడీ కొట్టించాడు. తన దగ్గర కొవిడ్ వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్‌బాబు దగ్గర నుంచి లక్ష రూపాయలు కొట్టేశాడో మాయగాడు. టీకా సప్లై చేస్తానని లక్ష రూపాయలు ట్రాన్స్‌ఫర్‌ చేయమనడంతో అతడిని నమ్మి లక్ష రూపాయలు సురేష్‌బాబు మేనేజర్ సదరు వ్యక్తి అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అయితే ఎన్నిసార్లు ఫోన్‌ చేసినప్పటికీ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి చివరకు మోసం జరిగిందని తెలుసుకున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story