Darshan: విషం ఇవ్వమన్న హీరో దర్శన్ కు కోర్టు ఊరట.. అవి ఇచ్చేందుకు అనుమతి

Darshan: విషం ఇవ్వమన్న హీరో దర్శన్ కు కోర్టు ఊరట.. అవి ఇచ్చేందుకు అనుమతి
x

Darshan: విషం ఇవ్వమన్న హీరో దర్శన్ కు కోర్టు ఊరట.. అవి ఇచ్చేందుకు అనుమతి

Highlights

రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన అగ్రహార జైలులో ఉన్న హీరో దర్శన్ కు కోర్టులో ఊరట లభించింది. అతడిని బళ్లారి జైలుకు మార్చాలనే అభ్యర్థనను కోర్టు తిరస్కరించినప్పటికీ, కొన్ని వ్యక్తిగత వస్తువుల వాడకానికి అనుమతి ఇచ్చింది. ఈ తీర్పుతో దర్శన్‌కు కాస్త ఉపశమనం లభించింది.

Darshan: రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన అగ్రహార జైలులో ఉన్న హీరో దర్శన్ కు కోర్టులో ఊరట లభించింది. అతడిని బళ్లారి జైలుకు మార్చాలనే అభ్యర్థనను కోర్టు తిరస్కరించినప్పటికీ, కొన్ని వ్యక్తిగత వస్తువుల వాడకానికి అనుమతి ఇచ్చింది. ఈ తీర్పుతో దర్శన్‌కు కాస్త ఉపశమనం లభించింది.

కోర్టులో దర్శన్ అభ్యర్థన

జైలులో తాను అనుభవిస్తున్న కష్టాలను దర్శన్ కోర్టుకు వివరించాడు. "నేను ఎండను చూసి 30 రోజులు అయింది. నా చేతులకు ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చింది. నాకు విషం ఇవ్వండి. కోర్టు నుంచే ఈ ఆదేశాలు ఇవ్వాలి" అని దర్శన్ అభ్యర్థించాడు. అందుకు జడ్జ్ "మీరు అలా మాట్లాడకూడదు" అని సూచించారు.

అలా ఎందుకు అడిగాడంటే..

సుప్రీం కోర్టు కఠిన ఆదేశాల తర్వాత పరప్పన అగ్రహార జైలులో దర్శన్‌కు గతంలో ఉన్నట్లుగా వీఐపీ సౌకర్యాలు లభించడం లేదు. సాధారణ ఖైదీలాగానే అతడిని చూస్తున్నారు. ఖైదీల గది నుంచి బయటకు కూడా వచ్చేందుకు అనుమతించడం లేదు. దీంతో దర్శన్ నరకయాతన అనుభవిస్తున్నాడు. అందుకే తనకు విషం ఇవ్వమని అడిగాడు.

కోర్టు తీర్పు

అయితే, దర్శన్‌కు మరికొంత ఊరట కల్పిస్తూ కోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. కోర్టు అతడికి ఎక్స్ ట్రా దిండు, పరుపును ఉపయోగించడానికి అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా జైలు ఆవరణలో తిరిగేందుకు కూడా అనుమతి ఇచ్చింది. అయితే, జైలు నిబంధనలను పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే, జైలు ఐజీ చర్యలు తీసుకోవచ్చని, అతడిని వేరే జైలుకు మార్చవచ్చని కూడా కోర్టు ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories