టాలీవుడ్ కి మరో సారి కరోనా టెన్షన్.. మళ్లీ 50% ఆక్యూ పెన్సీకి కుదింపు...?

టాలీవుడ్ కి మరో సారి కరోనా టెన్షన్.. మళ్లీ 50% ఆక్యూ పెన్సీకి కుదింపు...?
x
Highlights

టాలీవుడ్ లో ఒక వైపు హిట్స్ తో సంబరాలు మరో వైపు ఎప్పుడు ఏం అవుతుందోనని టెన్షన్. సోలో బ్రతుకే సో బెటర్, క్రాక్, 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? ఉప్పెనా,...

టాలీవుడ్ లో ఒక వైపు హిట్స్ తో సంబరాలు మరో వైపు ఎప్పుడు ఏం అవుతుందోనని టెన్షన్. సోలో బ్రతుకే సో బెటర్, క్రాక్, 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? ఉప్పెనా, నాంది ఇలా హిట్స్ తో సంబరాలు జరుపుకుంటున్న టాలీవుడ్ పై కరోనా భయం పట్టుకుంది.

100 శాతం ఆక్యూపెన్సీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, మరో వైపు హీరోలు తమ సినిమాలను వరస బెట్టి రిలీజ్ లు చేస్తున్నారు. చిన్న సినిమాల దగ్గర నుండి పెద్ద సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. వీటిలో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యాయి.

క్రాక్ సినిమా తర్వాత ఉప్పెన రిలీజ్ అయి దాదాపు 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ అయి వారం దాటిన ఇంకా రన్ అవుతునే వుంది. అటు చిత్ర యూనిట్ కూడ రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ టూర్లు చేస్తునే ఉంది. ఇక ఇటివల రిలీజ్ అయిన నాంది కూడ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. దీనిపై కూడ సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

మళ్లీ ఇప్పుడు కరోనా పుంజుకోవడంతో టాలీవుడ్ కి టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ మెంట్ చేసుకున్న హీరోలు, నిర్మాతలకు కరెక్ట్ టైంలో సినిమా రిలీజ్ లు చేసుకుంటామా లేదా అని ఆందోళనలో ఉన్నారు, మళ్ళీ 50 శాతం ఆక్యూ పెన్సీ కి మాత్రమే పర్మిషన్ కుదిస్తే తమ పరిస్థితి ఏమిటని ఆలోచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories