Corona Effect: సినీ ఇండస్ట్రీకి సినిమా చూపిస్తున్న సెకండ్‌ వేవ్‌

Corona Effect: కరోనాతో ఇప్పటికే పెద్ద సినిమాలు వాయిదా

Samba Siva Rao
Published on: 27 April 2021 4:11 PM IST
Tollywood
X
టాలీవుడ్ మూవీస్

Corona Effect: కరోనా సెకండ్‌ వేవ్‌ సినీ ఇండస్ట్రీని సినిమా చూపిస్తోంది. కరోనాతో ఇప్పటికే పెద్ద సినిమాలన్ని వాయిదా పడ్డాయి. చాలా మంది స్టార్స్‌ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఘాటింగ్స్‌ ఆపేసి సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ పాటించడం మంచిదని సినీ పెద్దలు భావిస్తున్నారు.

కరోనా ధాటికి ఇండస్ట్రీలో పరిస్థితులన్నీ తారుమారవుతున్నాయి. బాలీవుడ్‌లో ఎప్పుడు లేని విధంగా ఎక్కడికక్కడ షూటింగ్స్ మొత్తం నిలిచిపోయి. సినిమా రిలీజ్‌లన్నీ ఆగిపోయి. ఇక టాలీవుడ్ కూడా కరోనా తీవ్రత తగ్గే వరకు తాత్కలికంగా సినిమా షూటింగ్స్ నిలిపివేయాలనే ఆలోచనలు ఉన్నారు

వకీల్ సాబ్ సినిమా తర్వాత ఇక పెద్ద సినిమాలు అన్ని తమ రిలీజ్ డేట్స్ చేంజ్ చేసుకున్నాయి. ఇప్పుడు షూటింగ్స్ కూడా అక్కడక్కడ జరుగుతున్నా.. అవి కూడ ఆపేసి కొన్ని రోజులు సెల్ఫ్ లాక్ డౌన్ పాటించటం మంచిదని బావిస్తున్నారు సినీ పెద్దలు. ఈ టైంలోనే జూనీయర్ ఆర్టిస్ట్‌ల నుండి వర్కర్స్ వరకు అందరికీ వ్యాక్సిన్ కంప్లీట్ చేసేస్తే మంచిదని భావిస్తున్నారు. మొత్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తితో టాలీవుడ్‌ సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ పాటించబోతుంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story