Pushpa: కరోనా టెన్షన్‌లో 'పుష్ప' టీం; విడుదల ఆలస్యం?

Pushpa: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబో లో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

Venkata Chari
Published on: 31 March 2021 9:36 PM IST
Corona scare & Release tensions for Pushpa!
X

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (ఫొటో హన్స్ ఇండియా)

Pushpa: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబో లో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప పేరుతో మరో సంచలనం క్రియేట్ చేసేందుకు వీరిద్దరు రెడీ అయ్యారు. అలాగే ఈ సినిమాలో చాలా ప్రత్యేక అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తో వచ్చిన స్పందన పట్ల అల్లు అర్జున్, సుకుమార్ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నారు.

ఇదిలాఉంటే, ఈ చిత్రం విడుదల వాయిదా పడినట్లు వార్తలు వినిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం ఆగస్టులో థియేటర్లోకి వస్తుందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం షూటింగ్ ఆలస్యం కానున్నట్లుత తెలుస్తోంది. కారణం, COVID-19 కేసుల పెరుగుదలతో మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. షూటింగ్ ఎక్కువ భాగం ఔట్ డోర్ లోనే జరుగుతుండడంతో.. షూటింగ్ కు కోవిడ్ దెబ్బ పడుతోందని అంటున్నారు. ఇదే కారణంగా, సినిమాను సకాలంలో విడుదల చేయకపోవచ్చని భావిస్తున్నారు.

పుష్ప చిత్రంలో రష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్న ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story