Khiladi Movie: 'ఖిలాడీ' కి కరోనా దెబ్బ

Khiladi Movie: గతేడాది కరోనా దెబ్బకి..ఇంకా కోలుకోలేదు సినీ ఇండస్టీ. ఈ మధ్యే వరుస షూటింగ్ లు, సినిమాలతో బిజీ గా తయారైంది.

Venkata Chari
Updated on: 30 March 2021 5:04 PM IST
Khiladi: Ravi Tejas Khiladi Shotting Post Poned
X

రవితేజ (ఫొటో హన్స్ ఇండియా)

Khiladi Movie: గతేడాది కరోనా దెబ్బకి... ఇంకా కోలుకోలేదు సినీ ఇండస్టీ. ఈ మధ్యే వరుస షూటింగ్ లు, సినిమాలతో బిజీ గా తయారైంది. కానీ, ఇంతలోనే మరలా కరోనా సెంకడ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్నందున మరోసారి దెబ్బ తగిలే అవకాశం ఉంది. మొదటగా కరోనా సెకండ్ వేవ్ దెబ్బ రవితేజ 'ఖిలాడీ' కి తగిలిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ కాంబోలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాకు రమేశ్‌ వర్మ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. హీరో రవితేజ కాగా, ఆయనకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ చేసుకుంటుంది.

కాగా, ఇటలీలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున అక్కడ లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. అక్కడే షూటింగ్ నిర్వహిస్తున్న ఖిలాడీకి బ్రేకులు పడ్డాయని సమాచారం. అయితే, లాక్ డౌన్ తొలగింపుపై క్లారిటీ ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో టీం అంతా హైదరాబాద్ పయనమయ్యారని టాక్.

రవితేజ కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సస్పెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌ పై చాలా హోప్స్ ఉన్నాయి. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలకపాత్రల్లో సందడి చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్, గ్లింప్స్ విశేష ఆదరణ పొందాయి.

Venkata Chari

Venkata Chari

Next Story