Megastar Acharya Movie : 'ఆచార్య' కథ నాదే అంటూ మరో రచయిత

Megastar Acharya Movie : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా

Krishna
Published on: 27 Aug 2020 4:41 PM IST
Megastar Acharya Movie : ఆచార్య కథ నాదే అంటూ మరో రచయిత
X

Acharya

Megastar Acharya Movie : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.. ఈ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్మాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది 2021 సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం వెల్లడించింది. ఇది చిరంజీవికి 152 వ సినిమా కావడం విశేషం.. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా వలన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా కన్నెగంటి అనిల్ కృష్ణ అనే యువ రచయిత ఆచార్య కథ నాదేనంటూ 2006 సంవత్సరంలో తానూ పుణ్యభూమి అనే టైటిల్‌తో ఓ కథను రచయితల సంఘంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా వెల్లడించాడు. ఇప్పుడు మరో రచయిత ఈ కథ నాది అంటూ ఆరోపణలు చేశాడు. రాజేశ్ మండూరి అనే రచయిత 'ఆచార్య' కథ తనదేనంటూ ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.. ఈ మూవీ కథని తానూ రిజిస్టర్ చేయించుకున్నానని, తన దగ్గర పక్కా ఆధారలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు...

తానూ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నానని, చాలా మంది దర్శకుల దగ్గర పనిచేశానని, దర్శకత్వం వైపు వెళ్దామనే ఆలోచనతో 'పెద్దాయన' అనే టైటిల్‌తో ఈ కథని రాసుకున్నానని, దీనిని బాలయ్యతో చేయాలని అనుకున్నట్టుగా వెల్లడించాడు. ఇక చిరంజీవి, రామ్ చరణ్ జరిగిన అన్యాయానికి న్యాయం చేయలని కోరుతున్నట్టుగా వెల్లడించాడు. ఇక దీనిపైన ఆచార్య టీం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.. ఇక గతంలోనూ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు చిత్రం కూడా కాపీ అంటూ ఓ రచయిత ఆరోపణలు చేశాడు.

Krishna

Krishna

Next Story