Adipurush: ఉత్తరప్రదేశ్ లో ఆదిపురుష్ సినిమా పై వివాదం.. లక్నోలో ఆదిపురుష్ పోస్టర్లను చింపివేసిన..

Adipurush: చిత్ర బృందంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

Shekhar G
Published on: 19 Jun 2023 7:25 PM IST
Controversy Over Adipurush Movie In Uttar Pradesh
X

Adipurush: ఉత్తరప్రదేశ్ లో ఆదిపురుష్ సినిమా పై వివాదం.. లక్నోలో ఆదిపురుష్ పోస్టర్లను చింపివేసిన..

Adipurush: ఉత్తరప్రదేశ్ లో ఆదిపురుష్ సినిమా పై తీవ్ర వివాదం కొనసాగుతోంది. లక్నోలో హిందూ మహాసభ కార్యకర్తలు ఆదిపురుష్ పోస్టర్లను చింపివేసారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా చిత్రాన్ని నిర్మించారని ఆరోపించారు. హిందూ మతం, సంస్కృతికి వ్యతిరేకంగా చిత్రాన్ని నిర్మించారన్నారు. సినీ నిర్మాతలపై హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. సినిమాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ , ప్రజలు సినిమా చూడవద్దని విజ్ఞప్తి చేశారు. లక్నోలోని ఓ థియోటర్ లోకి ప్రవేశించి స్క్రీనింగ్‌ను నిలిపివేయడానికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story