Shashi Tharoor: "సర్కారు వారి పాట" సెట్లో ప్రత్యక్షమైన కాంగ్రెస్ సీనియర్ ఎంపీ

Shashi Tharoor: షూటింగ్ సెట్లో మహేష్ బాబు ని కలిసిన శశి థరూర్

admin1
Updated on: 9 Oct 2021 1:22 PM IST
Congress MP Shashi Tharoor Meets Mahesh Babu in Sarkaru Vaari Paata Shooting Set
X

సర్కారు వారి పాత సెట్ ను సందర్శించిన శశి థరూర్ (ఫైల్ ఇమేజ్)

Shashi Tharoor: సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమా అయిన "సర్కారు వారి పాట" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ మాదాపూర్లోని ట్రైడెంట్ హోటల్ లో జరుగుతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో ఒక రాజకీయ నాయకుడు ప్రత్యక్షమయ్యారు. ఆయన ఎవరో కాదు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ట్విట్టర్ వేదికగా ట్రైడెంట్ హోటల్ లో మహేష్ బాబుని కలుసుకున్నట్లు శశి థరూర్ కొన్ని ఫోటోలను సైతం షేర్ చేశారు.

"ట్రైడెంట్ హోటల్ లో మహేష్ బాబు షూటింగ్ చేస్తున్నారని తెలిసి నా సహోద్యోగి మరియు మహేష్ బాబు బావ గారు అయిన జై గల్లాతో అక్కడికి వెళ్లాను. మహేష్ బాబు ని కలిసి కాసేపు మాట్లాడాను. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయనతో మాట్లాడితే తెలుస్తుంది ఆయన నిజంగానే సూపర్ స్టార్ అని. అప్పుడే ఆయన సినిమాలో విలన్లతో పోరాడారు," అంటూ కొన్ని ఫోటోలను సైతం షేర్ చేశారు శశి థరూర్. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మరియు జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది.

admin1

admin1

Next Story