కొమరం భీమ్ టీజర్ పై సీతక్క ట్వీట్

Seethakka Tweet On RRR : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం RRR.. రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు..

Krishna
Published on: 22 Oct 2020 6:59 PM IST
కొమరం భీమ్ టీజర్ పై సీతక్క ట్వీట్
X

Seethakka Tweet On RRR : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం RRR.. రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది.

తాజాగా సినిమా నుంచి ఎన్టీఆర్ లుక్ ని ప్రెసెంట్ చేస్తూ ఓ టీజర్ ని బయటకు వదిలారు మేకర్స్.. దసరా కానుకగా వచ్చిన ఈ టీజర్ ముందుగా అనుకున్నట్టే వాటర్ బ్యాక్ గ్రౌండ్‌తో వచ్చింది. అల్లూరి సీతారామరాజు టీజర్‌ని నిప్పుతో, కొమురం భీం టీజర్‌ని నీటితో ప్లాన్ చేసిన జక్కన్న, విజువల్ ట్రీట్ ఇచ్చాడు. ఈ టీజర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందించడం మరో ప్లస్ గా మారింది. ఇక ఇంతకు ముందు విడుదల అయినటువంటి రామ్ చరణ్ లుక్ టీజర్ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం విశేషం.

అయితే ఈ టీజర్ పైన తెలంగాణా ఎమ్మెల్యే సీతక్క ట్విట్టర్ వేదికగా స్పందించారు. " మన్యం ముద్దుబిడ్డ, మా అన్న, మా ఆదర్శం కొమరం భీమ్ గారి జయంతిన నా ఘన నివాళులు. మా వీరుడు మన్యం పులి కొమరం భీమ్ గారి స్పూర్తితో తీస్తున్న చిత్ర యూనిట్ కి నా అభినందనలు" అని ఎమ్మెల్యే సీతక్క ట్వీట్ చేసింది. అటు ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 8 రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Krishna

Krishna

Next Story