కృష్ణ భౌతికకాయం తరలింపు విషయంలో గందరగోళం..

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయం తరలింపు విషయంలో గందరగోళం నెలకొంది.

Arun Chilukuri
Updated on: 15 Nov 2022 7:49 PM IST
Confusion Regarding Shifting of Krishnas Corpses
X

కృష్ణ భౌతికకాయం తరలింపు విషయంలో గందరగోళం..తన ఇంటికి పార్థివ దేహాన్ని తీసుకురావాలని కోరిన మహేష్..

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయం తరలింపు విషయంలో గందరగోళం నెలకొంది. గచ్చిబౌలి స్టేడియంకు తీసుకెళ్లే ముందు..తన ఇంటికి భౌతిక కాయాన్ని తీసుకురావాలని మహేష్ బాబు కోరారు. ఆ విషయంలో గందరగోళం నెలకొనడంతో కృష్ణ నివాసం నుంచి మహేష్‌బాబు వెళ్లిపోయారు. వాస్తవానికి సాయంత్రం 4 గంటలకే గచ్చిబౌలి స్టేడియానికి తీసుకెళ్లాల్సి ఉన్నా..ఇప్పటి వరకు ఆయన ఇంట్లోనే కృష్ణ పార్థీవ దేహం ఉంది.

కృష్ణ పార్టీవ దేహాన్ని ఎటు తీసుకెళ్తారో తెలియక అభిమానులు అయోమయంలో పడ్డారు. కృష్ణ ఇంటి ముందు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణ పార్టీవ దేహాన్ని గచ్చిబౌలి స్టేడియానికి తీసుకెళ్తారా లేక మహేష్ బాబు ఇంటికి తీసుకెళ్తారా అనేది మరికాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story