కృష్ణ మృతితో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. కృష్ణకు నివాళులర్పిస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు

Condolences Pour in for Veteran Actor Super Star Krishna
x

కృష్ణ మృతితో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. కృష్ణకు నివాళులర్పిస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు

Highlights

Super Star Krishna Passes Away: దివికేగిన తెలుగు సినీ నట దిగ్గజానికి సినీ, రాజకీయ ప్రముఖులు ట్విట్టర్‌లో నివాళులర్పించారు.

Super Star Krishna Passes Away: దివికేగిన తెలుగు సినీ నట దిగ్గజానికి సినీ, రాజకీయ ప్రముఖులు ట్విట్టర్‌లో నివాళులర్పించారు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఆయన మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసినట్లయిందని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా.. నిర్మాతల హీరోగా.. నటశేఖరుడిగా... సూపర్‌స్టార్ అని పిలిపించుకున్న నటుడు మనముందు లేకపోవడం ఎంతో బాధాకరమన్నారు. మహేశ్ బాబుతో పాటు కష్ణ కుటుంబస‌భ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో ఒక అద్భుత సినీ శకం ముగిసినట్లయిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. మాజీ ఎంపీ కృష్ణ మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. నటుడిగా.. దర్శకుడిగా... ఇటీవలే తల్లిని.. తండ్రిని కూడా కోల్పోయిన మహేశ్‌బాబుకు తీరని వేదన అన్నారు చంద్రబాబు ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని మహేశ్‌బాబుకు ఇవ్వాలని భగవంతుడుని కోరుకుంటున్నానని బాబు ట్వీట్ చేశారు. కృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ బాబు ట్వీట్ చేశారు.

సూపర్‌స్టార్ కృష్ణ మరణం మాటలకు అందని విషాదమని హీరో చిరంజీవి ట్వీట్ చేశారు. నటశేఖరుడు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదన్నారాయన కృష్ణ మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం లాంటి వారని... సాహసానికి ఊపిరి.. ధైర్యానికి పర్యాయ పదం వంటి వారన్నారు. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం కలబోతయే కృష్ణ అని చిరంజీవి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని... మహేశ్‌బాబుకు.. కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం.. సానుభూతిని వ్యక్తం చేశారు చిరంజీవి. సూపర్‌స్టార్ కృష్ణ మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకశ్ సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. విభిన్న పాత్రలతో కృష్ణ చేసిన ప్రయోగాలు అద్భుతమన్నారు. వేగంగా సినిమాలు పూర్తిచేయడంలో సూపర్ స్టార్ రికార్డులు సృష్టించారని లోకేష్ ట్వీట్‎లో తెలిపారు.

తెలుగు సినీరంగానికి హీరో కృష్ణ ఐకాన్ లాంటి వారని ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటని హీరో నిఖిల్ ట్వీట్ చేశారు. ముందు తరాల నటీనటులకు ఆయన ఎంతో స్ఫూర్తి అని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ హీరో నిఖిల్ ట్వీట్ చేశారు. నటశేఖరుడు కృష్ణ మరణం తనను ఎంతో బాధించిందన్నారు హీరో విష్ణు. కృష్ణ కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ట్వీట్ సూపర్‌స్టార్ కృష్ణ మరణాన్ని నమ్మలేకపోతున్నానంటూ దర్శకుడు MS రాజు ట్వీట్ చేశారు. కృష్ణ ఆత్మకు శాంతి కలగాలని... ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారారు MS రాజు.

సూపర్‌స్టార్ కృష్ణ మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఆయన మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటన్నారాయన... నటుడు, నిర్మాత, దర్శకుడు, నిర్మాణ సంస్థ అధినేతగా తెలుగు సినిమా రంగానికి.. 5 దశాబ్దాల పాటు కృష్ణ అందించిన సేవలను సీఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు. కృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారాయన.

నటశేఖరుడు కృష్ణ మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారామె.

సూపర్‌స్టార్ కృష్ణ మృతి పట్ల మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం కేటీఆర్... నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా.. తెలుగు సినిమా రంగానికి ఆయన సేవలు అజరామరమని మంత్రి కేటీఆర్ అన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

సూపర్‌స్టార్‌ కృష్ణ మృతికి మంత్రి ఎర్రబెల్లి సంతాపం తెలిపారు. కృష్ణ కుటుంబంతో తన సాన్నిహిత్యాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. అద్భుతమైన నటుడిని కోల్పోవడం బాధాకరమని విచార వ్యక్తం చేశారు మంత్రి ఎర్రబెల్లి... కృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ఎర్రబెల్లి తెలిపారాయన.

సినీ పరిశ్రమలో సూపర్‌ స్టార్‌ కృష్ణ స్థానం అద్వితీయమని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. కృష్ణ మృతి తెలుగు సినీ రంగానికి, తెలుగు జాతికి తీరని లోటన్నారామె.

సూపర్‌స్టార్ కృష్ణ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురియ్యానని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ప్రజలను చైతన్యం చేసే ఎన్నో చిత్రాల్లో నటించారని, కృష్ణ మరణం తెలుగు ప్రజలకు, సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారాయన.

సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతి పట్ల టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సినిమా రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చి... నూతన ఒరవడి సృష్టించార‎ని చెప్పారాయన.... కృష్ణ మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటన్నారు రేవంత్‌రెడ్డి.

సినీ హీరో కృష్ణ మృతి బాధాకరమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి 5 దశాబ్దాల పాటు విశేష సేవలందించారన్నారామె... 350కి పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు మంత్రి... కృష్ణ మరణం సినీ పరిశ్రమకు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

కృష్ణ తెలుగు సినీపరిశ్రమకే ఓ ధ్రువతార అని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. సాంకేతికంగా తెలుగు సినీపరిశ్రమకు ఖ్యాతిని పెంచారన్నారు.. కృష్ణ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు కాసాని జ్ఞానేశ్వర్.

సూపర్‌స్టార్ కృష్ణ మృతి పట్ల జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారాయన తెలుగు సినిమాకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసిన వ్యక్తి కృష్ణ అని, సూపర్‌స్టార్‌ బిరుదును కృష్ణ సార్థకం చేశారని ఆయన అన్నారు.

సూపర్‌ స్టార్‌ కృష్ణ చాలా సన్నిహితంగా ఉండేవారని హీరో మురళీమోహన్‌ అన్నారు. ఏ సమస్య వచ్చినా పలకరించేవారని, సినిమాల్లో చాలా మానవత్వం ఉన్న గొప్ప హీరో కృష్ణ అని అన్నారాయన.... ఏదైనా చేయాలనుకుంటే ధైర్యంగా ముందుకెళ్లేవారని అన్నారు... 350కి పైగా సినిమాల్లో హీరోగా చేశారంటే మామూలు విషయం కాదని, కృష్ణ డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ హీరో అని మురళీ మోహన్‌ గుర్తు చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories