Allu Arjun: చిక్కుల్లో అల్లు అర్జున్.. ఆర్మీ పేరుపై అభ్యంతరం

అర్జున్ అర్జున్ నటించిన పుష్ఫ2 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పుష్ప2 కోసం దేశం మొత్తం తిరుగుతూ అల్లు అర్జున్ ప్రమోట్ చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 Nov 2024 5:27 PM IST
Complaint Against Allu Arjun Over Allu Army Name
X

Allu Arjun: చిక్కుల్లో అల్లు అర్జున్.. ఆర్మీ పేరుపై అభ్యంతరం

Allu Arjun: అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని హైదరాబాదు జవహర్ నగర్ పోలీసులకు గ్రీన్ పీస్ ఎన్విరాన్ మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు భైరి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు. తనకు అభిమానులు కాదు.. ఆర్మీ ఉందంటూ ఇటీవల పుష్ప2 ఈవెంట్లలో అల్లు అర్జున్ చెప్పడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

అర్జున్ అర్జున్ నటించిన పుష్ఫ2 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పుష్ప2 కోసం దేశం మొత్తం తిరుగుతూ అల్లు అర్జున్ ప్రమోట్ చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో సినిమా ప్రమోట్ చేసే ఈవెంట్లలో పాల్గొంటున్నారు. ఓ ఈవెంట్ లో అల్లు అర్జున్ తన అభిమానులను ఆర్మీతో పోల్చాడు.

అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ క్లబ్ కి అర్జున్ ఆర్మీ అని పేరు పెట్టారు. పుష్ఫ2 ఈవెంట్లలో కూడా ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. దీనిపై శ్రీనివాస్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ తన అభిమానులను ఆర్మీ అంటూ పిలిచారు అని.. ఆర్మీ అనే పదం దేశానికి సేవ చేసే వారికి గౌరవప్రదమైన పేరు, దాన్ని ఎలా అభిమానులకు పెట్టుకుంటారు అంటూ బైరి శ్రీనివాస్ గౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆర్మీ అనేది జాతీయ సమగ్రతకు, దేశ భద్రతకు సంబంధించిన అంశం. అలాంటి ఆర్మీ పదంను అల్లు అర్జున్ తప్పుగా ఉపయోగిస్తున్నారని ఆ ఫిర్యాదులో చెప్పారు. ఫ్యాన్స్ ను ఆర్మీ అంటూ చెప్పడాన్ని తప్పుబట్టిన శ్రీనివాస్..కేసు నమోదు చేయాలని జవహర్ నగర్ పోలీసులను కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story