Ravi Teja - Sharwanand: రవితేజ సినిమా తో శర్వానంద్ డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం

Ravi Teja - Sharwanand: "ఆడవాళ్లు మీకు జోహార్లు" సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించలేకపోయింది.

admin1
Updated on: 9 March 2022 5:10 PM IST
Compensation for Aadavallu Meeku Johaarlu Movie Distributors with Ravi Teja Movie | Tollywood News
X

Ravi Teja - Sharwanand: రవితేజ సినిమా తో శర్వానంద్ డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం

Ravi Teja - Sharwanand: ఈ మధ్యన శర్వానంద్ హీరోగా నటించిన "ఆడవాళ్లు మీకు జోహార్లు" సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించలేకపోయింది. రష్మీక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 20 కోట్లకు అమ్ముడయ్యాయి. కానీ విడుదలైన మొదటి రోజున కనీసం 15 శాతం కూడా రికవరీ రేట్ లేకపోవడం సినిమా కలెక్షన్లు భారీగా దెబ్బతీసింది. రివ్యూలు కూడా యావరేజ్ గానే ఉండడంతో సినిమా అనుకున్న బజ్ ను క్రియేట్ చేయలేకపోయింది.

దీంతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై ఈ సినిమాని నిర్మించిన నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు కు వచ్చిన భారీ నష్టానికి పరిహారం చెల్లించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రవితేజ హీరోగా నటిస్తున్న "రామారావు ఆన్ డ్యూటీ" సినిమా రైట్స్ ని వేలం వేయాలని నిర్ణయించుకున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ మరియు ఆర్టీ టీం వర్క్స్ సంయుక్తంగా "రామారావు ఆన్ డ్యూటీ" సినిమాను నిర్మిస్తున్నాయి.

మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో ఒక డిప్యూటీ కలెక్టర్ పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. దివ్యాంశ కౌశిక్ మరియు రాజీషా విజయన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ సినిమాతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎంతవరకు నష్టపరిహారం చెల్లించగలరో చూడాల్సి ఉంది.

admin1

admin1

Next Story