Raghu Karumanchi: మద్యం బిజినెస్ లోకి దిగిన టాలీవుడ్ కమెడియన్

మద్యం షాపులు సొంతం చేసుకున్న కమెడియన్ రఘు

admin1
Published on: 3 Dec 2021 4:38 PM IST
Comedian Raghu Karumanchi Sales Liquor in his New Business | Tollywood News
X

Raghu Karumanchi: మద్యం బిజినెస్ లోకి దిగిన టాలీవుడ్ కమెడియన్

Raghu Karumanchi: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ కమెడియన్ లలో రఘు కూడా ఒకరు. ఎక్కువగా విలన్ దగ్గర కనిపించే సైడ్ క్యారెక్టర్ లలో నటించిన రఘు కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఇప్పుడు రఘు లిక్కర్ వైన్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాల వేలం లో రఘు కూడా పాల్గొన్నారు. నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్ పక్కనే ఉన్న అభినవ్ 1 & 2 దుకాణాలను రఘు కొనుగోలు చేశారు.

తాజాగా దుకాణాల ముందు పూజలు నిర్వహించి కాసేపు కౌంటర్లలో నిలబడి మద్యం కూడా అమ్మడు రఘు. తర్వాత తన మిత్రులతో కలిసి మరో రెండు వైన్ షాపులు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. కాగా ఈసారి టెండర్లలో చాలామంది కొత్త వాళ్లకి షాపులు దొరికాయట. అలాగే దుకాణంలోని రిజర్వేషన్లు కల్పిస్తూ వేలం నిర్వహించింది గవర్నమెంట్. గౌడ్ సామాజిక వర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం దక్కేలా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో మందు షాపుల సంఖ్య మరింత పెరిగింది.

admin1

admin1

Next Story