Hyper Aadi: అప్పుడు పంచులు వేశాడు.. ఇప్పుడు పరిగెడుతున్నాడా..??

Sandeep Reddy
Updated on: 7 Nov 2021 2:41 PM IST
Comedian Hyper Aadi Facing Problem With the Tollywood Hero Fans
X

Hyper Aadi: అప్పుడు పంచులు వేశాడు..ఇప్పుడు పరిగెడుతున్నాడా..??

Hyper Aadi: జబర్దస్త్ కామెడీ షోలో తన పంచులతో బుల్లితెర పేక్షకులను కడుపుబ్బా నవ్వించే హైపర్ ఆది.. ఇటీవల దీపావళి సందర్భంగా ఒక ప్రముఖ ఛానెల్ లో జరిగిన ఫెస్టివల్ ఈవెంట్ లో టాలీవుడ్ కి చెందిన ఒక హీరోని ఇమిటేట్ చేస్తూ పంచ్ డైలాగులతో కామెడీ చేశాడు. తాజాగా ఆ కామెడీ కాస్త హైపర్ ఆదికి తలనొప్పిని తెచ్చిపెట్టింది. సినీ పరిశ్రమలో ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన ఆ హీరోపై ఆది వేసిన పంచులకు గానూ.. ఆ హీరో అభిమానులు హైపర్ ఆదిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది.

అంతేకాదు ఎక్కడున్నాడోనని ఆది కోసం వెతుకులాటడం కూడా మొదలుపెట్టారు ఆ సదరు హీరో అభిమానులు. దీంతో చేసేదేమీ లేక తాను తీసుకున్న గోతిలో తానే పడినట్టుగా ఎవరికీ కనిపించకుండా హైపర్ ఆది అటు షూటింగ్ లకు వెళ్ళలేక, ఇటు ఇంటి వద్ద ఉండలేక, చివరికి తన సొంత వాహనంలో తిరగలేక గత రెండు మూడు రోజులుగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. పంచులు వేసినపుడు పడిపడి నవ్వుకున్నా.. ఇప్పుడు తన పంచులే తన పాలిట శాపమై పరుగులెత్తిస్తున్నాయని హైపర్ ఆదికి ఇపుడైనా బాగానే అర్దమై ఉండొచ్చు.

అయితే హైపర్ ఆదికి ఇలా జరగడం ఇదేం మొదటిసారి కూడా కాదు.. అంతకు ముందు కూడా ఇలా కొంతమంది వ్యక్తులపైనే కాకుండా కొన్ని పండుగలపై కూడా నోరుజారి జనాల కోపానికి గురై క్షమాపణలు కూడా చెప్పిన సందర్భాలున్నాయి. మరి తాజాగా ఆ హీరోకి బహిరంగంగా క్షమాపణలు చెబుతాడో లేదా ఆ హీరో అభిమానుల ఆగ్రహానికి గురి అవుతాడో వేచి చూడాల్సిందే. ఏదేమైనా నిమిషం నవ్వుకోడానికి ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టె విధంగా ఇమిటేట్ చేస్తూ జోకులు వేయడం మాత్రం రాక్షసానందమే అవుతుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story