Bigg Boss 5 Update: బిగ్ బాస్-5 లో కమెడియన్ అలీ..!?

Sandeep Reddy
Updated on: 6 July 2021 6:29 PM IST
Comedian Ali to Participate in Bigg Boss 5 Telugu as Contestant
X

కమెడియన్ అలీ 

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షో హిందీలో బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ హోస్ట్ గా మొదలైన ఈ షోని నెమ్మదిగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మొదలుపెట్టారు. తెలుగులో ఇప్పటికే 4 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ రియాలిటీ షో మరో సీజన్ తో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ షోలో పాల్గొనే పోటీదారుల ఎంపిక పనిలో ఉన్న బిగ్ బాస్ టీం తాజాగా తెలుగు స్టార్ కమెడియన్ అలీని కలిసినట్లు తెలుస్తుంది. సీజన్ 5 లో పాల్గొనాలని అలీని కోరడంతో పాటు రెమ్యునరేషన్ కూడా బాగానే ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. కాని టీం ఇచ్చిన ఆఫర్ కి అలీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సినీ వర్గాల సమాచారం. ఒకవేళ అలీ ఈ రియాలిటీ షోలో పాల్గొంటే మాత్రం ప్రతిసారి తను మాట్లాడే డబుల్ మీనింగ్ మాటలతో ఈ షోని కూడా కొంతవరకు స్పైసీ గా ఉండనుంది.

మరోపక్క జబర్దస్త్ నుండి హైపర్ ఆది, టిక్ టాక్ స్టార్ దుర్గరావు, యుట్యుబ్ స్టార్ శన్ముఖ్ జశ్వంత్, డాన్స్ మాస్టర్ శేఖర్ తో పాటు సినీ నటి సురేఖ వాణి, జానపద గాయని మంగ్లీ వంటి సెలెబ్రేటిస్ బిగ్ బాస్-5 రియాలిటీ షో లో పాల్గొనబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్-4 కంటే కూడా ఈ సారి పాల్గొనబోయే పోటీదారుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు బిగ్ బాస్ తెలుగు టీం. ఇక హోస్ట్ గా గత రెండు సీజన్లో ఉన్న నాగార్జున మరోసారి నాలుగవ సీజన్లో కూడా కనిపించబోతున్నాడు. అయితే నాగార్జున సినిమా షూటింగ్ కారణంగా మొదటి కొన్ని ఎపిసోడ్లకి అందుబాటులో ఉండడని అతనికి బదులుగా రానా హోస్ట్ గా కొన్ని ఎపిసోడ్లు చేయబోతున్న వార్త ఇపుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story