Colours Swathi: కార్తికేయ సీక్వెల్ లో కలర్స్ స్వాతి

Colours Swathi: కార్తికేయ సీక్వెల్ తో పాటు మరో రెండు సినిమాల్లో స్వాతి నటిస్తున్నట్లు టాలీవుడ్ టాక్

Kranthi
Published on: 2 July 2021 9:07 AM IST
Colors Swathi Starts the Second Innings Gets Good Offers
X

Colors Swathi:(File Image) 

Colours Swathi: తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు స్వాతి రెడ్డి అలియాస్ కలర్స్ స్వాతి దాదాపు 4 సంవత్సరాల తరువాత మరోసారి టాలీవుడ్ లో సందడి చేసేందు సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించింది. నిఖిల్ కార్తికేయ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఈ సినిమాలో కూడా స్వాతి నటిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో ఈ భామ అవకాశాలు దక్కించుకుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే స్వాతి 'పంచతంత్రం' అనే సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. నూతన దర్శకుడు హర్ష పులిపాక ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. యంగ్ హీరో నిఖిల్‌తో కలిసి స్వాతి.. స్వామిరారా, కార్తికేయ వంటి సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

15 ఏళ్లకే యాంకర్ అయి.. అనేక పాపులర్ షోలకు యాంకరింగ్ చేసి, తర్వాత సైడ్ ఆర్టిస్టుగా మారి.. హీరోయిన్‌గా ఎదిగింది స్వాతి. తెలుగులోనే కాకుండా తమిళ మలయాళీ ఇండస్ట్రీలో కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2018లో మలయాళీ పైలెట్ వికాస్ వాసును పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.

Kranthi

Kranthi

Next Story