Colours Swathi: భర్తతో విడిపోయిన కలర్స్ స్వాతి.. డైవర్స్ తీసుకోనుందా.. మరోసారి అదే ప్రచారం..?

Colours Swathi Divorce: బుల్లి తెరలో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకుని, ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కలర్స్ స్వాతి.. టాలీవుడ్ నుంచి దక్షిణాదిలోనూ తనదైన ముద్రవేసుకుంది.

Arun Chilukuri
Published on: 18 July 2023 5:53 PM IST
Colours Swathi Divorce Rumors Goes Viral on Social Media
X

Colours Swathi: భర్తతో విడిపోయిన కలర్స్ స్వాతి.. డైవర్స్ తీసుకోనుందా.. మరోసారి అదే ప్రచారం..?

Colours Swathi Divorce: బుల్లి తెరలో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకుని, ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కలర్స్ స్వాతి.. టాలీవుడ్ నుంచి దక్షిణాదిలోనూ తనదైన ముద్రవేసుకుంది. ఇక నిఖిల్ కాంబినేషన‌ల్‌లో స్వామిరారా, కార్తికేయతో బంపర్ హిట్‌లు అందుకుంది. విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఆడవారి మాటలకు అర్థాలు వేరులే సినిమాలోనూ మెప్పించింది. నానితో కలిసి నటించిన అష్టాచమ్మాతో నంది అవార్డును కూడా దక్కించుకుంది.

అయితే, కలర్స్ స్వాతి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓన్యూస్ సంచలనంగా మారింది. కెరీర్ పీక్స్‌లో అందరికీ షాక్ ఇస్తూ.. మలయాళీ కుటుంబానికి చెందిన పైలెట్ వికాస్ వాసును 2018లో స్వాతి వివాహం చేసుకుంది. అయితే, వీరిది ప్రేమ పెళ్లికావడం విశేషం. మ్యారేజ్ తర్వాత థాయ్‌ల్యాండ్‌లో వీరిద్దరు సెటిల్‌ అయ్యారు.

కాగా, కలర్స్ స్వాతి తన భర్త పైలెట్ వికాస్ వాసు నుంచి విడిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు ఆజ్య పోసింది తన ఇన్‌స్టాగ్రామ్ కావడం గమనార్హం. ఎందుకంటే, స్వాతి తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి భర్త ఫొటోలను డిలీట్ చేసిందంట. దీంతో వీరిద్దరి మధ్య చెడిందని, అందుకు భర్త నుంచి దూరంగా ఉంటుందని చెబుతున్నారు. ఇటీవలే నిహారిక కూడా ఇలానే చేసిందని నెటిజన్లు అంటున్నారు. దీంతో కలర్స్ స్వాతి విషయంలో అదే జరగబోతోందని అంటున్నారు. కలర్స్ స్వాతి విషయంలో ఇలాంటి న్యూస్ రావడం కొత్తేమీ కాదు. 2 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి వార్తలు తెగ వినిపించాయి. కానీ, ఆ తర్వాత స్వాతి రంగంలోకి దిగింది. తన భర్త ఫొటోలు తీయడంలో గల కారణాన్ని కూడా వీడియో రూపంలో చూపించింది. దాంతో అందరి నోళ్లకు మూతలు వేసేసింది.

మరోసారి ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. కాగా, పెళ్లి తర్వాత చానాళ్లూ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన స్వాతి.. 2019లో మళయాలంలో త్రిశూరపురం అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. తెలుగులో పంచతంత్రంతో పాటు మరో2 సినిమాలు చేసింది. ప్రస్తుతం సినిమాల్లో జోరు పెంచిన స్వాతి.. హైదరాబాద్‌లోనే ఉంటుందంట. ఆమె భర్త వికాస్ వాసు మాత్రం థాయ్‌ల్యాండ్‌లోనే ఉంటున్నాడంట. మరోసారి సంచలనంగా మారిన స్వాతి విడాకుల విషయంలో అసలు నిజమెంతంతనేది తెలియాల్సి ఉంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story