Colours Swathi: విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన కలర్స్ స్వాతి

Colours Swathi: ఇరవై ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు కోరుతున్న కలర్స్ స్వాతి

Rama Rao
Updated on: 29 Sept 2022 7:00 PM IST
Colors Swathi Naveen Chandra Latest Movie Month of Madhu Movie Teaser Released
X

Colours Swathi: విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన కలర్స్ స్వాతి 

Colours Swathi: వైవిధ్యమైన పాత్రలతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు న‌వీన్ చంద్ర‌. తాజాగా నవీన్ చంద్ర హీరోగా కలర్స్ స్వాతి హీరోయిన్ గా "మంత్ ఆఫ్ మ‌ధు" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. శ్రీకాంత్ నాగోటి దర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాను క్రిష్వి ప్రొడ‌క్ష‌న్స్‌, హ్యండ్ పిక్డ్ స్టోరీస్ బ్యాన‌ర్స్‌పై య‌శ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు.

గతంలో న‌వీన్ చంద్ర, శ్రీకాంత్ నాగోటి కాంబో లో వచ్చిన "భానుమతి అండ్ రామకృష్ణ" మంచి విజయాన్ని సాధించింది. తాజాగా రిలీజైన చిత్ర టీజర్‌ ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది. 1 నిమిషం 58 సెక‌న్లు నిడివి ఉన్న ఈ చిత్ర టీజర్ కలర్స్ స్వాతి తన స్నేహితురాలితో నవీన్ చంద్ర ను ప్రేమిస్తున్న విషయాన్ని చెప్పడంతో మొదలవుతుంది. ఇక కట్ చేస్తే ఇరవై ఏళ్ల తర్వాత స్వాతి నవీన్ తో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.

"ఇరవై ఏళ్ల బాధను ఇరవై నిమిషాల లో చెప్పలేను" అని స్వాతి డైలాగ్ వింటే సినిమా మొత్తం వీరిద్దరి కథ గురించే ఉంటుంది అని తెలుస్తుంది. ఇంతకీ ఆ ఇరవై ఏళ్ల బాధ ఏంటి? స్వాతి, నవీన్ విడాకులు తీసుకున్నారా? లేక మళ్లీ కలిసిపోయారా? అసలు ఎందుకు విడాకులు తీసుకోవాలని అనుకున్నారు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Rama Rao

Rama Rao

Next Story