Cobra Movie First Look : ఏడు అవతారాల్లో విక్రమ్.. ఇర్ఫాన్‌ పటాన్ కూడా..

Cobra Movie First Look : ఏడు అవతారాల్లో విక్రమ్.. ఇర్ఫాన్‌ పటాన్ కూడా..
x
Cobra movie
Highlights

కోలీవుడ్ అగ్రకథనాయకుడు చియాన్ విక్రమ్ జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాలకు ఎల్లప్పుడూ ముందుంటారన్న విషయం తెలిసిందే. శివపుత్రుడు, అపరిచితుడు, ఐ,...

కోలీవుడ్ అగ్రకథనాయకుడు చియాన్ విక్రమ్ జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాలకు ఎల్లప్పుడూ ముందుంటారన్న విషయం తెలిసిందే. శివపుత్రుడు, అపరిచితుడు, ఐ, ఇంకొక్కడు ఇలా పాత్రల కోసమే కాదు, గెటప్‌ల కోసం ఆయన పడే శ్రమ మాటల్లో చెప్పలేం. విక్రమ్‌ వైవిధ్యమైన సినిమాల కోసం తపిస్తారనేది తాజా చిత్ర పోస్టర్ లో నిరూపించారు. విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కోబ్రా'. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం విక్రమ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కోబ్రా సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను సినిమా యూనిట్‌ శుక్రవారం విడుదల చేసింది. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ సినిమా ఒక్క ఫస్ట్‌లుక్‌లోనే విక్రమ్ మరో వైవిధ్య పాత్ర చేస్తున్నారని అర్థమవుతోంది. ఈ పోస్టర్‌లో విక్రమ్‌ ఏడు గెటప్‌లలో కనిపించారు. అన్ని గెటప్‌లు డిఫెరెంట్‌గా ఉన్నాయి. దీంతో ఆయన అభిమానులు తెగ సంబర పడుతున్నారు. కోబ్రా ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌ అని అంటోన్నారు. కోబ్రా చిత్రంపై పరిశ్రమ వర్గాల్లోనూ అంచనాలు భారీగానే ఉన్నాయని చెపొచ్చు. కోబ్రా విక్రమ్ గత సినిమాలకంటే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం అన్నది గమనార్హం. విక్రమ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు వెరైటీ టైటిల్‌... డీమాంటీ కాలనీ, ఇమైకా నొడిగళ్‌ వంటి డిఫరెంట్ చిత్రాలను చేశారు. ఈ సినిమాలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్‌ పటాన్, ఆనంద్‌రాజ్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. 7 స్క్రీన్‌ స్టూడియో బ్యానర్‌పై ఎస్‌ఎస్‌.లలిత్‌కుమార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హరీశ్‌కణ్ణన్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతాన్ని సమకూర్చారు. 'కోబ్రా' టైటిల్ పై అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలసిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories